iDreamPost
android-app
ios-app

కోహ్లీ బర్త్ డేకి భారీ సర్ ప్రైజ్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • Published Oct 31, 2023 | 2:54 PM Updated Updated Oct 31, 2023 | 5:01 PM

విరాట్ కోహ్లీ అభిమానులకు నవంబర్ 5 అంటే పండగరోజు అనే చెప్పాలి. పైగా ఆరోజు సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ కూడా ఉంది. ఈ రోజుని విరాట్ అభిమానులకు మరింత స్పెషల్ గా మార్చేందుకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ మరిన్ని ఏర్పాట్లు చేస్తోంది.

విరాట్ కోహ్లీ అభిమానులకు నవంబర్ 5 అంటే పండగరోజు అనే చెప్పాలి. పైగా ఆరోజు సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ కూడా ఉంది. ఈ రోజుని విరాట్ అభిమానులకు మరింత స్పెషల్ గా మార్చేందుకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ మరిన్ని ఏర్పాట్లు చేస్తోంది.

  • Published Oct 31, 2023 | 2:54 PMUpdated Oct 31, 2023 | 5:01 PM
కోహ్లీ బర్త్ డేకి భారీ సర్ ప్రైజ్.. చరిత్రలో ఇదే తొలిసారి!

నవంబర్ 5వ తారీఖు.. విరాట్ కోహ్లీ అభిమానులకు పండుగరోజు అనే చెప్పాలి. ఆరోజు కింగ్ కోహ్లీ పుట్టినరోజు మాత్రమే కాకుండా.. అదేరోజు సౌత్ ఆఫ్రికాతో టీమిండియా తలపడబోతోంది. అంటే కోహ్లీ అభిమానులకు మాత్రమే కాకుండా క్రికెట్ అభిమానులకు కూడా ఆరోజు కన్నుల విందుగా ఒక ఇన్నింగ్స్ ని ఎక్స్ పెక్ట్ చేయచ్చు. కోహ్లీ అభిమానుల సంబరాలు, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ పక్కన పెడితే.. అభిమానులకు మరో కొన్ని సర్ ప్రైజ్ లు ఉన్నాయి. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) విరాట్ కోహ్లీ పుట్టినరోజుని ఎప్పటికీ గుర్తుండిపోయేలా అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది.

విరాట్ కోహ్లీ పుట్టిన రోజు అంటే కేవలం ఫ్యాన్స్ కి మాత్రమే కాదు.. క్రికెట్ అభిమానులు అందరికీ గుర్తుండిపోవాలి అనే ఉద్దేశంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోజు విరాట్ కోహ్లీ, అభిమానులకు పెద్దఎత్తున సర్ ప్రైజ్ లు ప్లాన్ చేసింది. నిజానికి వరల్డ్ కప్ మ్యాచ్ లో ఒక క్రికెటర్ కోసం ఇలాంటి సర్ ప్రైజ్ లు ప్లాన్ చేయడం.. చరిత్రలో ఇదే తొలిసారి అని చెప్పాలి. ఆ రోజు దాదాపుగా స్టేడియం నిండా విరాట్ కోహ్లీ అభిమానులే ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడూ లేని విధంగా 70 వేల విరాట్ కోహ్లీ మాస్కులను పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆ రోజు మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కోసం ఒక స్పెషల్ కేక్ ని కూడా సిద్ధం చేస్తున్నారు. విరాట్ పేరు వినగానే ఏదైతే అభిమానుల మదిలో మెదులుతుందే అలాంటి థీమ్ తో కేక్ ని రెడీ చేస్తున్నట్లు తెలిపారు.

ఈ మొత్తం ఏర్పాట్ల గురించి క్యాబ్ ప్రెసిడెంట్ స్నాహాశిష్ కీలక వ్యాఖ్యలు చేశారు. “విరాట్ కోసం మేము ఒక స్పెషల్ కేక్ సిద్ధం చేశాం. కోహ్లీ పేరు గుర్తురాగానే మీకు ఏదైతే గుర్తొస్తుందో అలాంటి ఒక కాన్సెప్ట్ తో ఈ కేక్ ని సిద్ధం చేయిస్తున్నాం. కేకు ఫొటోలు అప్పుడే రివీల్ చేయాలి అనుకోవడం లేదు. అది అందరికీ సర్ ప్రైజ్ గానే ఉండాలి. అలాగే మ్యాచ్ మిడ్ ఇన్నింగ్స్ లో ఒక స్పెషల్ ఫైర్ క్రాకర్ షో ఉంటుంది. ఈ విధంగా విరాట్ కోహ్లీ పుట్టినరోజును మేము సెలబ్రేట్ చేయాలి అనుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో కోల్ కతా ప్రేక్షకులు అందరూ భాగస్వాములనే మేము భావిస్తున్నాం. ఈ మ్యాచ్ లో స్టేడియం మొత్తం కచ్చితంగా విరాట్ కోహ్లీ అభిమానులతో నిండి పోతుందని భావిస్తున్నాం. అందుకే వారందరి తరఫున మేము ఇలా సెలబ్రేట్ చేయాలి అనుకుంటున్నాం” అంటూ క్యాబ్ ప్రెసిడెంట్ స్నేహాశిష్ వ్యాఖ్యానించారు.

నిజానికి విరాట్ కోహ్లీ అభిమానులకు ఇది చాలా పెద్ద సర్ ప్రైజ్ అనే చెప్పాలి. ఈడెన్ గార్డెన్స్ స్టేడియం మొత్తం కోహ్లీ ఫేస్ మాస్కులతో నిండిపోతుంది. ఎటు చూసినా కూడా స్క్రీన్ మీద కోహ్లీనే కనిపిస్తాడు. నిజానికి ఒక క్రికెటర్ పుట్టినరోజుని ఈ విధంగా సెలబ్రేట్ చేయడం.. అది కూడా వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇలాంటి ఒక ఘటన జరగడం ఇదే తొలిసారి. కింగ్ కోహ్లీ అభిమానులకు నిజంగానే ఈ మ్యాచ్ ఒక పండగ అవుతుదిం. అలాంటి ఒక మ్యాచ్ లో గనుక విరాట్ శతకం బాదేస్తే.. ఈ పుట్టినరోజు మరింత స్పెషల్ అవుతుంది. మరి.. కోహ్లీ పుట్టినరోజుకి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఇస్తున్న సర్ ప్రైజ్ లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş