RR vs DC: ట్రెంట్‌ బౌల్ట్‌ను దారుణంగా అవమానించిన ఢిల్లీ!

Delhi Capitals, Trent Boult, RR vs DC: మ్యాచ్‌లో బౌలర్లు, బ్యాటర్ల మధ్య ఈగో ఫైట్‌ నడుస్తూ ఉంటుంది. అది మంగళవారం డీసీ వర్సెస్‌ ఆర్‌ఆర్‌ మ్యాచ్‌లో ట్రెంట్‌ బౌల్ట్‌, జేక్‌ ఫ్రేజర్‌ మధ్య కూడా అలాంటి ఫైట్‌ జరిగింది. దీనిపై డీసీ బౌల్ట్‌ను దారుణంగా ట్రోల్‌ చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Delhi Capitals, Trent Boult, RR vs DC: మ్యాచ్‌లో బౌలర్లు, బ్యాటర్ల మధ్య ఈగో ఫైట్‌ నడుస్తూ ఉంటుంది. అది మంగళవారం డీసీ వర్సెస్‌ ఆర్‌ఆర్‌ మ్యాచ్‌లో ట్రెంట్‌ బౌల్ట్‌, జేక్‌ ఫ్రేజర్‌ మధ్య కూడా అలాంటి ఫైట్‌ జరిగింది. దీనిపై డీసీ బౌల్ట్‌ను దారుణంగా ట్రోల్‌ చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో డీసీ 20 పరుగుల తేడాతో ఆర్‌ఆర్‌పై పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగి.. రాజస్థాన్‌ బౌలర్లను అల్లాడించిన డీసీ, బౌలింగ్‌లోనూ సత్తా చాటి.. కీలక విజయం సాధించింది. ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే.. కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో డీసీ పంజా విసిరింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చి.. ఈ సీజన్‌లో 6వ విజయాన్ని అందుకుంది. అయితే.. రాజస్థాన్‌ రాయల్స్‌ స్టార్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ను మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్‌ దారునంగా అవమానించింది.

ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్‌లో బౌల్ట్‌ వేసిన బాల్‌ను సరిగా అంచనా వేయలేకపోయాడు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌. దాంతో బాల్‌ తాకి కొద్ది సేపు అల్లాడిపోయాడు. దాంతో.. రాజస్థాన్‌ రాయల్స్‌ ట్విట్టర్‌లో నెట్స్‌ అండ్‌ బౌల్ట్స్‌ అంఊ.. నట్‌, బోల్ట్‌ వేరు వేరుగా ఉన్న పిక్‌ పోస్ట్‌ చేసింది. అయితే.. తర్వాత బౌల్ట్‌ వేసిన ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో జేక్‌ ఫ్రేజర్‌ ఒక సిక్స్‌, రెండు ఫోర్లు, ఒక సింగిల్‌తో మొత్తం 15 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత ఆవేశ్‌ ఖాన్‌ వేసిన నాలుగో ఓవర్‌లో ఏకంగా 4 4 4 6 4 6 బాది 28 పరుగులు పిండుకున్నాడు. మొత్తంగా 19 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు.

దీంతో.. రాజస్థాన్‌ రాయల్స్‌ చేసిన నట్స్‌ అండ్‌ బౌల్ట్స్‌ ట్వీట్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ రీప్లే ఇస్తూ.. అవుట్‌ అయ్యే ముందు బౌల్ట్‌ను ఫిక్స్‌ చేశాడు. జేక్‌ ఫ్రేజర్‌ వద్ద డ్రిల్‌ ఉంది అంటూ ట్వీట్‌ చేసింది. ఇన్‌ డైరెక్ట్‌గా తొలి ఓవర్‌లో తనను గాయపర్చిన బౌల్ట్‌కు జేక్‌ ఫ్రేజర్‌ బుద్ధి చెప్పాడంటూ.. ఢిల్లీ క్యాపిటల్స్‌ పేర్కొంది. ఇలా ఈ రెండు టీమ్స్‌ మధ్య గ్రౌండ్‌లో మ్యాచ్‌తో పాటు సోషల్‌ మీడియా వేదికగా ఫైటింగ్‌ కూడా నడిచింది. ఈ ఫైట్‌ను క్రికెట్‌ అభిమానులు బాగా ఎంజాయ్‌ చేశారు. అయితే.. ఇదంతా సరదాగా చేసే ట్వీట్స్‌ మాత్రమే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments