Nidhan
Virat Kohli, Shubman Gill, Deepfake Video: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌కు మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిచ్చు పెట్టింది. దీని వల్ల కోహ్లీ-గిల్ ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
Virat Kohli, Shubman Gill, Deepfake Video: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌కు మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిచ్చు పెట్టింది. దీని వల్ల కోహ్లీ-గిల్ ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
Nidhan
అత్యాధునిక సాంకేతికత ఫుల్‌గా అందుబాటులోకి వచ్చేసింది. ప్రస్తుత టెక్నాలజీలో అన్నింటి కంటే ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఇప్పుడు చాలా రంగాల్లో వాడుతున్నారు. అయితే దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నా.. కొందరు మాత్రం చెడు పనుల కోసం వాడుతున్నారు. ముఖ్యంగా ఏఐ సాయంతో సెలెబ్రిటీలను టార్గెట్ చేసుకొని వాళ్లను అనవసర వివాదాల్లోకి లాగుతున్నారు. డీప్‌ఫేక్ లాంటి టెక్నాలజీ హెల్ప్‌తో ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేస్తూ.. సెలెబ్రిటీలను లక్ష్యంగా చేసుకొని కొందరు చేస్తున్న ఆగడాలు అంతా ఇంతా కాదు. తాజాగా టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, యంగ్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ మధ్య ఇలాగే ఏఐని ఉపయోగించి చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించారు. అసలేం జరిగింది అనేది ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందరితో కలసిపోతాడు. టీమ్‌లోని సీనియర్లు, యంగ్‌స్టర్స్ అనే తేడాల్లేకుండా అందర్నీ కలుపుకొని పోతాడు. యంగ్‌స్టర్ గిల్‌ను కూడా కెరీర్ ఆరంభం నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు కింగ్. అయితే తాజాగా శుబ్‌మన్‌ను కోహ్లీ విమర్శిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో.. ‘గిల్‌ను చాలా దగ్గర నుంచి చూస్తున్నా. అతడు టాలెంటెడ్ ప్లేయర్. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ లెజెండ్‌గా మారడం అంత ఈజీ కాదు. బాగా ఆడటానికి దిగ్గజ స్థాయికి చేరుకోవడానికి మధ్య ఎంతో తేడా ఉంది. గిల్ టెక్నిక్ సాలిడ్‌గా ఉంది. కానీ మా రేంజ్‌కు చేరుకోలేడు. అందరూ నెక్స్ట్ విరాట్ కోహ్లీ ఎవరని అంటున్నారు. వాళ్లకు ఒక్కటే చెబుతా.. కోహ్లీ ఒక్కడే. నేను టఫెస్ట్ బౌలర్లను ఎదుర్కొని కఠిన పరిస్థితుల్లో పరుగులు చేశా. దశాబ్ద కాలానికి పైగా కన్సిస్టెంట్గా రన్స్ చేశా. కొన్ని ఇన్నింగ్స్‌ల్లో బాగా ఆడినంత మాత్రాన ఆ స్థాయికి చేరుకోలేరు’ అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.
భారత క్రికెట్లో గాడ్ సచిన్ టెండూల్కర్, అలాగే తాను మాత్రమే ఉన్నామని.. ఓ బెంచ్‌మార్క్‌ను సెట్ చేశామని ఆ వీడియోలో విరాట్ చెబుతున్నట్లు ఉంది. గిల్ తమ స్థాయిని చేరుకోవాలంటే ఎంతో దూరం ప్రయాణించాలని చెప్పడాన్ని కూడా చూడొచ్చు. గిల్‌ను కోహ్లీ విమర్శిస్తున్నట్లు ఉన్న ఈ వీడియో చూసి చాలా మంది నిజమనుకున్నారు. ఇది ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టింది. గిల్‌ను అలా ఎలా అంటారని, తీసిపారేస్తారని కొందరు సీరియస్ అవుతున్నారు. అయితే ఇది నిజం కాదని.. కోహ్లీ అలా అనలేదని తేలింది. డీప్‌ఫేక్ వీడియో అని.. విరాట్ ఏదో ఇంటర్వ్యూ మాట్లాడిన క్లిప్పింగ్‌ను తీసుకొని ఆడియోను మార్చి ఇలా వైరల్ చేస్తున్నారని తెలిసింది. కావాలని అభిమానుల మధ్య గొడవ పెట్టేందుకు, వ్యూస్ కోసం చేసిన వీడియో ఇదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇలాంటి వీడియోలు, ఆడియోలు, ఫొటోల నుంచి జాగ్రత్తగా ఉండాలని.. అధికారికంగా వస్తే తప్ప అంత ఈజీగా నమ్మొద్దని సూచిస్తున్నారు. వీటి మాయను కనిపెట్టకపోతే కష్టమేనని కామెంట్స్ చేస్తున్నారు.
AI is Dangerous pic.twitter.com/njUvwiwc4t
— Cricketopia (@CricketopiaCom) August 27, 2024