iDreamPost
android-app
ios-app

Virat Kohli: కోహ్లీ నేను కలిసి తెల్లవార్లు తాగాం! మాజీ క్రికెటర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

  • Published Jan 30, 2024 | 8:14 PM Updated Updated Jan 30, 2024 | 8:14 PM

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ గురించి ఓ మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ తెల్లవారు జామున మూడు గంటల వరకు తాగుతూనే ఉన్నాం అంటూ షాకింగ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం...

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ గురించి ఓ మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ తెల్లవారు జామున మూడు గంటల వరకు తాగుతూనే ఉన్నాం అంటూ షాకింగ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం...

  • Published Jan 30, 2024 | 8:14 PMUpdated Jan 30, 2024 | 8:14 PM
Virat Kohli: కోహ్లీ నేను కలిసి తెల్లవార్లు తాగాం! మాజీ క్రికెటర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

టీమిండియా సూపర్‌స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఆటగాడిగా ఎంత కమిట్‌మెంట్‌తో ఉంటాడో.. ఆఫ్‌ ది ఫీల్డ్‌లో కూడా ప్రతి విషయంలో చాలా కంట్రోల్‌గా ఉంటాడు. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే కోహ్లీ.. ఫుడ్‌ విషయంలో చాలా కేరింగ్‌గా ఉంటాడు. అతిగా తినడం అస్సలు చేయడు. అలాంటి విరాట్‌ కోహ్లీ ఒకరోజు ఓ స్టార్‌ క్రికెటర్‌తో కూర్చోని.. రాత్రంతా మందుకొట్టాడనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కోహ్లీ ఏంటి మందు తాగడం ఏంటి? అంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు కోహ్లీ ఎవరితో కలిసి, ఎక్కడ మందు తాగాడు? ఆ విషయం ఎవరు బయటపెట్టారు? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

విరాట్‌ కోహ్లీ కెరీర్‌ ఆరంభంలో చాలా అగ్రెసివ్‌గా ఉండేవాడనే విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యర్థి ఎవరైనా సరే.. నోరు జారితే అందుకు పదింతలు బదులు చెప్పేవాడు. ఒక కెప్టెన్‌ అయిన తర్వాత కోహ్లీ దూకుడు మరింత పెరిగింది. కెప్టెన్‌గా ఉన్నంత కాలం.. తననే కాదు టీమ్‌లో ఎవర్ని ఏమన్నా.. కోహ్లీ రియాక్ట్‌ అయ్యేవాడు. టీమిండియాలో ఏ ఆటగాడిని ఏమన్నా.. కోహ్లీ ఊరుకోడు అనే భయం అందరిలోనూ కలిగింది. ముఖ్యంగా స్టెడ్జింగ్‌కు మారుపేరుగా నిలిచిన ఆస్ట్రేలియా లాంటి టీమ్‌ను వాళ్ల సొంత గడ్డపై స్టెడ్జ్‌ చేసిన ఆటగాడు కోహ్లీ. అంత దూకుడు స్వభావం ఉన్న కోహ్లీకి ఓ సారి సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ మధ్య గొడవ జరిగింది.

ఇండియాలో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న సందర్భంగా ఎల్గర్‌పై కోహ్లీ ఉమ్మేశాడంట. ఆ విషయాన్ని ఎల్గరే స్వయంగా వెల్లడించాడు. ఇటీవల డీన్‌ ఎల్గర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఎల్గర్‌కి సంబంధించి ఓ సంచలన విషయాన్ని వెల్లడించాడు. తనకు కోహ్లీకి ఇండియాలో గొడవ జరిగిందని, కానీ, రెండేళ్ల తర్వాత కోహ్లీ టెస్టు సిరీస్‌ కోసం సౌతాఫ్రికా వచ్చిన సమయంలో తనకు సారీ చెప్పాడని, ఆ తర్వాత ఇద్దరం కలిసి మందు తాగినట్లు చెప్పుకోచ్చాడు ఎల్గర్‌. సిరీస్‌ ముగిసిన తర్వాత కలిసి.. ఒక రాత్రి మొత్తం మందు తాగుతూ కూర్చున్నామని, అప్పట్లో కోహ్లీ మందుకు తాగేవాడని, ఇప్పుడు మానేశాడని ఎల్గర్‌ తెలిపాడు. మరి కోహ్లీ ఎల్గర్‌తో కలిసి మందుకు తాగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss