బిగ్‌ బ్రేకింగ్‌: రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌! ఇండియా-సౌతాఫ్రికా సిరీస్‌ తర్వాత..

ఇండియాతో టెస్ట్‌ సిరీస్‌ కోసం సిద్ధం అవుతున్న సౌతాఫ్రికాకు భారీ షాక్‌ తగిలింది. టెస్ట్‌ సిరీస్ ఆరంభానికి ముందు ఆ జట్టు మాజీ కెప్టెన్‌ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ప్రకటించాడు. అతనెవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియాతో టెస్ట్‌ సిరీస్‌ కోసం సిద్ధం అవుతున్న సౌతాఫ్రికాకు భారీ షాక్‌ తగిలింది. టెస్ట్‌ సిరీస్ ఆరంభానికి ముందు ఆ జట్టు మాజీ కెప్టెన్‌ ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ప్రకటించాడు. అతనెవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌, మూడు వన్డేల సిరీస్‌ను ముగించుకుంది భారత జట్టు. ఇక డిసెంబర్‌ 26 నుంచి భారత్‌-సౌతాఫ్రికా మధ్య రెండు టెస్టుల సిరీస్‌ మొదలవనుంది. ఈ సిరీస్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు.. సౌతాఫ్రికా స్టార్‌ బ్యాటర్‌, మాజీ కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ సంచలన ప్రకటన చేశాడు. ఎల్గర్‌ వీడ్కోలతో సౌతాఫ్రికా టెస్ట్‌ స్క్వౌడ్‌ కాస్త బలహీన పడనుంది. అయితే.. భారత్‌తో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌ తర్వాతనే ఎల్గర్‌ ఆటకు గుడ్‌బై చెప్పనున్నాడు. దీంతో టెస్ట్‌ సిరీస్‌లో సౌతాఫ్రికా ఇండియాకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. 2012లో ఆస్ట్రేలియాతో పెర్త్‌ వేదికగా జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌తో ఎల్గర్‌ సాంప్రదాయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2012లో ఆగస్టులో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో ఎల్గర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

ఎల్గర్‌ తన కెరీర్‌లో మొత్తం 84 టెస్ట్‌ మ్యాచ్‌లు, 8 వన్డేలు, ఆడాడు. టెస్టుల్లో సౌతాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అయితే.. 84 టెస్టుల్లో 37.28 యావరేజ్‌తో 5146 పరుగులు చేశాడు. అందులో 13 సెంచరీలు, 23 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇక 8 వన్డేల్లో 104 పరుగులు మాత్రమే చేశాడు. వన్డేల్లో ఎల్గర్‌కు ఒక్క సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. ఇక ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 243 మ్యాచ్‌లు ఆడి 16475 పరుగులు చేశాడు. అందులో 47 సెంచరీలు, 68 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇక లిస్ట్‌ ఏ క్రికెట్‌లో 178 మ్యాచ్‌లు ఆడి.. 6264 పరుగులు చేశాడు. అందులో 10 సెంచరీలు, 45 హాఫ్‌ సెంచరీలు సాధించాడు. బ్యాటింగ్‌తో పాటు అప్పుడప్పుడు బౌలింగ్‌ కూడా చేసిన ఎల్గర్‌.. టెస్టుల్లో 15, వన్డేల్లో 2 వికెట్లు కూడా పడగొట్టాడు. మరి ఎల్గర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments