Somesekhar
పాకిస్తాన్ తో జరుగుతున్న తొలి టెస్టు లో డేవిడ్ వార్నర్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. అయితే సెంచరీ చేసిన టైమ్ లో వెరైటీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు వార్నర్. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
పాకిస్తాన్ తో జరుగుతున్న తొలి టెస్టు లో డేవిడ్ వార్నర్ భారీ సెంచరీతో కదం తొక్కాడు. అయితే సెంచరీ చేసిన టైమ్ లో వెరైటీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు వార్నర్. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Somesekhar
మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది పాకిస్తాన్ జట్టు. వన్డే వరల్డ్ కప్ తర్వాత పాక్ ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడంతో.. ఆ జట్టుపై తీవ్ర ఒత్తిడి ఉంది. ఇప్పటికే ప్రపంచ కప్ లో దారుణ వైఫల్యం కారణంగా విమర్శలు ఎదుర్కొంటోంది పాక్. ఇన్ని సంక్షిష్ట పరిస్థితుల మధ్య కంగారూ గడ్డపై కాలుమోపింది. ఇక అందరూ అనుకున్నట్లుగానే ఆసీస్ టీమ్ పాక్ బౌలర్లను దంచికొడుతోంది. మరీ ముఖ్యంగా ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రత్యర్థి బౌలర్లపై ఫోర్లతో విరుచుకుపడుతున్నాడు. ఈ క్రమంలోనే భారీ సెంచరీని నమోదు చేశాడు డేవిడ్ భాయ్. అయితే అతడు సెంచరీ చేసిన తర్వాత చేసుకున్న సెలబ్రేషన్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ సెలబ్రేషన్స్ ఆసీస్ మాజీ పేసర్ మిచెల్ జాన్సన్ కు కౌంటరేనా? అంటూ కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
పాక్ తో పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో ఆసీస్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ కు ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా-డేవిడ్ వార్నర్ లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు తొలి వికెట్ కు 126 పరుగులు జోడించారు. అనంతరం ఖవాజా(41) పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. ఆ వెంటనే క్రీజ్ లోకి వచ్చిన లబూషేన్(16) తక్కువ పరుగులుకే పెవిలియన్ చేరాడు. స్టీవ్ స్మిత్ కూడా 31 పరుగులకే అవుటైయ్యాడు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్నా గానీ.. పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ భారీ శతకం సాధించాడు వార్నర్. 129 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఇక వార్నర్ సెంచరీ తర్వాత చేసుకున్న సెలబ్రేషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ శతకం తర్వాత వెరైటీగా శతక వేడుకలు చేసుకున్నాడు.
అయితే ఈ వెరైటీ వేడుకలు మిచెల్ జాన్సన్ కు కౌంటర్ అంటూ కొందరు క్రికెట్ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. వార్నర్ కు పాక్ తో జరిగే టెస్ట్ సిరీస్ లాస్ట్ ది. దీంతో అతడికి ఘన వీడ్కోలు పలకాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావించింది. ఈ విషయంపై మిచెల్ జాన్సన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అతడు హీరో కాదు.. అతడికి ఘన వీడ్కోలు ఎందుకు అంటూ కామెంట్స్ చేశాడు. తాజాగా ఈ విమర్శలకు తన బ్యాట్ తోనే సమాధానం ఇచ్చాడు వార్నర్. ఇదే విషయాన్ని మ్యాచ్ బ్రేక్ టైమ్ లో చెప్పుకొచ్చాడు. “మనపై విమర్శలు వస్తాయి, అయితే ఆ విమర్శలన్నింటికి మన బ్యాట్ తోనే సమాధానం చెప్పాలి. నిశ్శబ్దంగా ఉంటూ స్కోర్ బోర్డుపై పరుగులు సాధించాలి అంతే” అంటూ జాన్సన్ కు కౌంటర్ ఇచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మూడో సెషన్ వరకు 3 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది ఆస్ట్రేలియా టీమ్. వార్నర్ 190 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్స్ లతో 148 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడికి తోడు ట్రావిస్ హెడ్ 28 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. మరి వార్నర్ వెరైటీ సెంచరీ సెలబ్రేషన్స్ మిచెల్ జాన్సన్ కు కౌంటరేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
🤫#AUSvPAK pic.twitter.com/pzraWkHmIa
— 7Cricket (@7Cricket) December 14, 2023
David Warner said, “there’s going to be criticism, but you gotta take that and silence them. No better way than to put runs on the board”. pic.twitter.com/hQgKWkVcQw
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 14, 2023