iDreamPost
android-app
ios-app

బీచ్‌లో ప్రేయసికి రింగ్‌ ఇచ్చి ప్రపోజ్‌ చేసిన స్టార్‌ క్రికెటర్‌

  • Published Sep 01, 2023 | 1:54 PM Updated Updated Sep 01, 2023 | 1:54 PM
  • Published Sep 01, 2023 | 1:54 PMUpdated Sep 01, 2023 | 1:54 PM
బీచ్‌లో ప్రేయసికి రింగ్‌ ఇచ్చి ప్రపోజ్‌ చేసిన స్టార్‌ క్రికెటర్‌

ప్రేమించిన అమ్మాయికి ప్రేమ విషయం చెప్పి, పెళ్లికి ఒప్పించడం ఎంతో స్పెషల్‌. ప్రతి ప్రేమికుడికి అది చాలా కష్టంతో కూడిన ఇష్టమైన పని. ప్రపోజ్‌ చేసిన వెంటనే ఆ అమ్మాయి ఒప్పుకుంటే.. ఆ ప్రేమికుడి సంతోషం కొలవడానికి ఈ భూమ్మీద కొలమానమే ఉండదు. ఇలాంటి ఆనందం చాలా మందికి దక్కకపోవచ్చు. కానీ, ప్రేమించిన అమ్మాయి మన లైఫ్‌లోకి వచ్చేందు ఒప్పుకుంటే వచ్చే సంతోషం.. కామన్‌ మ్యాన్‌కైనా, స్టార్‌ క్రికెటర్‌కైనా ఒక్కటే. తాజాగా అలాంటి సంతోషాన్నే పొందుతున్నాడు సౌతాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ మిల్లర్‌. ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు ఆడుతూ.. ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు దగ్గరైపోయిన మిల్లర్‌.. ఇప్పుడు తన ప్రేయసికి కూడా చాలా దగ్గరపైపోయాడు.

తనను పెళ్లి చేసుకోవడానికి గర్ల్‌ఫ్రెండ్ కామిలా ఒప్పుకుందంటూ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించాడు. మిల్లర్‌ కొంత కాలంగా కామిలా అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. తాజాగా జింబాబ్వేలోని ఎంపాలా జేనా బీచ్‌లో కామిలాకు డైమండ్‌ రింగ్‌ ఇచ్చి మరీ ప్రపోజ్‌ చేశాడు. ఆమె కూడా మిల్లర్‌ ప్రపోజల్‌కు ఓకే చెప్పేసింది. దీంతో ఎంతో సంబరపడిపోయిన మిల్లర్‌.. ‘తను ఓకే చెప్పేసింది’ అంటూ సోషల్‌ మీడియాలో అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నాడు. కామిలాను కిస్‌ చేస్తున్న ఫొటోలతో పాటు తన చేతికి తొడిగిన రింగ్‌ ఫొటోలను అభిమానులతో పంచుకున్నాడు.

‘కిల్లర్ మిల్లర్’ అని భారత క్రికెట్‌ అభిమానులు ప్రేమగా పిలుచుకునే ఈ డ్యాషింగ్ బ్యాటర్.. 2022 ఐపీఎల్‌ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌ని ఛాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా సౌతాఫ్రికా ఆస్ట్రేలియాతో ఆడుతున్న టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న మిల్లర్‌.. తన పర్సనల్‌ లైఫ్‌పై ఫోకస్‌ పెట్టాడు. తన జీవితభాగస్వామిగా వచ్చేలా ప్రేమించిన అమ్మాయిని ఒప్పించాడు. దీనిపై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెంటనే స్పందించాడు. హార్ట్ సింబల్స్‌తో రిప్లై ఇచ్చాడు. అలాగే రాజస్థాన్ రాయల్స్‌‌లో మిల్లర్‌తో కలిసి ఆడిన మహిపాల్ లోమ్రోర్, జీటీ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా మిల్లర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. మరి మిల్లర్‌ లవ్‌ సక్సెస్‌ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Dave Miller (@davidmillersa12)

ఇదీ చదవండి: అతనికి అంత సీన్‌ లేదు.. రోహిత్‌ ఇరగదీస్తాడు: గంగూలీ

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet