CSK గెలిచింది సరే.. మరి ఈ ప్లేయర్‌ సంగతేంటి? సింగిల్స్‌ తీయడానికి 14 కోట్లా?

CSK గెలిచింది సరే.. మరి ఈ ప్లేయర్‌ సంగతేంటి? సింగిల్స్‌ తీయడానికి 14 కోట్లా?

Daryl Mitchell, CSK vs MI, IPL 2024: ఐపీఎల్‌ 2024లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సూపర్‌ సక్సెస్‌గా దూసుకెళ్తున్నా.. ఆ జట్టులోని ఓ ఆటగాడి ఫామ్‌ మాత్రం అందరిని కలవరపెడుతోంది. మరి ఆ ప్లేయర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

Daryl Mitchell, CSK vs MI, IPL 2024: ఐపీఎల్‌ 2024లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సూపర్‌ సక్సెస్‌గా దూసుకెళ్తున్నా.. ఆ జట్టులోని ఓ ఆటగాడి ఫామ్‌ మాత్రం అందరిని కలవరపెడుతోంది. మరి ఆ ప్లేయర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

సీఎస్‌కే వర్సెస్‌ ఎంఐ మ్యాచ్‌ క్రికెట్‌ ప్రేమికులకు ఫుల్‌ వినోదాన్ని అందించి.. పైసా వసూల్‌ మ్యాచ్‌గా నిలిచింది. రుతురాజ్‌ గైక్వాడ్‌, శివమ్‌ దూబే తన తడఖా చూపించడంతో పాటు చివర్లో ధోని మెరుపులు మొత్తం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచాయి. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌ సమయంలో రోహిత్‌ శర్మ సెంచరీ చేయడంపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. అయితే.. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించినప్పుటికీ.. ఆ జట్టులోని ఓ ఆటగాడి ఫామ్‌ మాత్రం సీఎస్‌కే ఫ్యాన్స్‌ను కంగారు పెడుతోంది. మరి అతను ఎవరు? ఎందుకు అలా విఫలం అవుతున్నాడు? టీమ్‌కు ఎలా భారంగా మారుతున్నాడు ఇప్పుడు చూద్దాం..

ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియం వేదికగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. కెప్టెన్‌ రుతురాజ్ గైక్వాడ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 69 పరుగులు చేసి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. అలాగే శివమ్ దూబె 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులతో 66 రన్స్‌ చేసి రాణించాడు. చివర్లో ధోని 4 బంతుల్లోనే 20 చేసి.. సీఎస్‌కేకు మంచి ముగింపు ఇచ్చాడు. సీఎస్‌కే 206 పరుగుల భారీ స్కోర్‌ చేసినా.. ఆ జట్టులోని కాస్ట్లీ ఆటగాడు డారిల్‌ మిచెల్‌ ఫామ్‌ మాత్రం దారుణంగా ఉంది.

ఐపీఎల్‌ 2024 కోసం జరిగిన వేలంలో మిచెల్‌ను సీఎస్‌కే ఏకంగా రూ.14 కోట్ల భారీ ధరపెట్టి కొనుగోలు చేసింది. వన్డే వరల్డ్ కప్‌ 2023లో విధ్వంసకర ఆటతో డారిల్ మిచెల్ పరుగుల వరద పారించడంతో అతనిపై చెన్నై భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ ఈ సీజన్‌లో డారిల్ మిచెల్ వరుసగా 22, 24*, 34, 13, 25, 17 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలం అవుతున్నాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. సీఎస్‌కే నిర్దేశించిన 207 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేసి.. 20 రన్స్‌ తేడాతో ఓటమి పాలైంది. 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులతో 105 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా.. ముంబైని గెలిపించలేకపోయాడు. మరి ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఆటగాడు డారిల్‌ మిచెల్‌ వైఫల్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments