Somesekhar
మ్యాచ్ గెలిచిన తర్వాత ధోని కొట్టిన 3 సిక్సులపై జోకులు పేల్చాడు రుతురాజ్. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఏమన్నాడంటే?
మ్యాచ్ గెలిచిన తర్వాత ధోని కొట్టిన 3 సిక్సులపై జోకులు పేల్చాడు రుతురాజ్. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఏమన్నాడంటే?
Somesekhar
ఐపీఎల్ 2024 సీజన్ లో వరుసగా రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్. దీంతో హ్యాట్రిక్ విజయాలు సాధించాలని ఉవ్విళ్లూరిన ముంబై ఇండియన్స్ టీమ్ కు షాక్ తగిలింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో ఎంఐ టీమ్ ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో మెుదట కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే, ఎంఎ ధోని బ్యాటింగ్ లో చెలరేగగా.. బౌలింగ్ లో జూనియర్ మలింగ 4 వికెట్లతో అదరగొట్టాడు. అయితే మ్యాచ్ గెలిచిన తర్వాత ధోని కొట్టిన 3 సిక్సులపై జోకులు పేల్చాడు రుతురాజ్. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్ లో చెన్నై బ్యాటర్ డార్లీ మిచెల్ పెవిలియన్ చేరిన తర్వాత బ్యాటింగ్ కు దిగాడు మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని. అప్పటికి ఇంకా 4 బంతులే మిగిలి ఉన్నాయి. ఇక ధోని రాకతో.. స్టేడియం మెుత్తం దద్దరిల్లిపోయింది. ధోని.. ధోని.. అనే నినాదాలు మారుమ్రోగిపోయాయి. ఇక వచ్చీ రావడంతోనే ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ను చీల్చి చెండాడాడు. వరుసగా 3 సిక్సర్లు బాది.. తనలో ఇంకా పసతగ్గలేదని నిరూపించాడు. ఈ నాలుగు బంతుల్లో ధోని 20 పరుగులు సాధించి.. చెన్నై స్కోర్ ను 200 దాటించాడు. అతడు కొట్టిన ఈ 20 పరుగుల తేడాతోనే చెన్నై విజయం సాధించడం విశేషం.
కాగా.. విజయం తర్వాత మాట్లాడిన కెప్టెన్ రుతురాజ్ కు ఓ ప్రశ్న ఎదురైంది. అదేంటంటే? ఈ మ్యాచ్ లో గేమ్ ఛేంజింగ్ మూమెంట్ ఏంటి? అని హోస్ట్ అడగ్గా.. రుతురాజ్ ఇచ్చిన ఆన్సర్ వైరల్ గా మారింది. ఆ క్వశ్చన్ కు గైక్వాడ్ సమాధానం చెబుతూ..”ఈ విజయంలో ప్రతీ ఒక్క ఆటగాడి పాత్ర ఉంది. కానీ మా యువ వికెట్ కీపర్(ధోనిని ఉద్దేశించి) కొట్టిన మూడు సిక్సులే మమ్మల్ని ఆదుకున్నాయి. అయితే ఈ పిచ్ పై మరో 15 పరుగులు అవసరమని భావించాం. ధోని చివర్లో మెరుపులు మెరిపించడంతో.. 200 మార్క్ ను దాటి విజయం సాధించాం. ఇక మా జూనియర్ మలింగ(మతీష పతిరణ) మరోసారి తన పదునైన పేస్ తో ఆకట్టుకున్నాడు. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేశాడు” అంటూ చెప్పుకొచ్చాడు రుతురాజ్. యువ వికెట్ కీపర్ అంటూ ధోని పేరు చెప్పడంతో.. అక్కడ ఒక్కసారిగా నవ్వులు పూశాయి. ఏంటి బ్రో అప్పుడే ధోనిపై జోకులు వేసే రేంజ్ కు వచ్చావా? అంటూ ఫ్యాన్స్ సరదాగా గైక్వాడ్ పై కామెంట్స్ చేస్తున్నారు. మరి గైక్వాడ్ తన హాస్యచతురతని జోడించి ధోనిపై సరదాగా జోకులు వేయడం మీకేవిధంగా అనిపించిందో, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.