Nidhan
సరదాగా క్రికెట్ ఆడేందుకు వెళ్లిన ఓ యువకుడు గుండె నొప్పితో కుప్పుకూలాడు. పిచ్ పైనే ప్రాణాలు వదిలాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
సరదాగా క్రికెట్ ఆడేందుకు వెళ్లిన ఓ యువకుడు గుండె నొప్పితో కుప్పుకూలాడు. పిచ్ పైనే ప్రాణాలు వదిలాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
Nidhan
మన దేశంలో క్రికెట్‌కు ఉండే క్రేజ్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు బ్యాట్ పట్టిన వారే. చిన్నతనం నుంచే అందరికీ క్రికెట్ ఆడే అలవాటు ఉంటుంది. పేద, ధనిక అనే సంబంధం లేకుండా బ్యాట్, బాల్ ఉంటే చాలు.. అందరూ గ్రౌండ్‌కు వెళ్లిపోతుంటారు. టీమ్ ఫామ్ చేసుకొని మ్యాచులు ఆడతారు. ఆడేందుకు చోటు లేకపోతే గల్లీలనే గ్రౌండ్‌గా చేసుకుంటారు. అంతగా క్రికెట్‌తో అందరూ మమేకం అయిపోయారు. భారత్‌లో ఎంటర్టైన్మెంట్ అంటే.. క్రికెట్, సినిమాలే. చిన్నప్పుడే కాదు పెద్దయ్యాక కూడా కాస్త టైమ్ దొరికినా అందరూ బ్యాట్లు పట్టుకొని మ్యాచ్‌లు ఆడేస్తుంటారు. గ్రౌండ్స్ మాట్లాడుకొని గ్లేజ్ బాల్‌తో టోర్నీలు ఆడటం కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. అలా సరదాగా ఓ మ్యాచ్ ఆడుతూ ఒక ఇంజినీర్ పిచ్‌పై కుప్పకూలాడు. క్రికెట్ ఆడుతూ టెకీ ప్రాణాలు వదిలాడు.
క్రికెట్ ఆడుతూ గ్రౌండ్లో వికాస్ నేగి అనే ఇంజినీర్ చనిపోయిన ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. మార్వెరిక్స్ ఎలెవన్, బ్లేజింగ్ బుల్స్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మార్వెరిక్స్ ప్లేయర్ వికాస్ నేగి (34) పద్నాలుగో ఓవర్లో బ్యాటింగ్‌కు దిగాడు. అప్పటికే క్రీజులో ఉన్న ఉమేశ్ కుమార్ అనే మరో బ్యాటర్ ఒక ఫోర్ కొట్టాడు. దీంతో అతడ్ని ఎంకరేజ్ చేసేందుకు వెళ్లిన వికాస్ అక్కడే కుప్పకూలాడు. దీంతో వికెట్ కీపర్ సహా మిగతావాళ్లు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వెంటనే అతడికి సీపీఆర్ చేశారు. కానీ వికాస్ లేవకపోవడంతో దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతడు చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. దీంతో వాళ్లంతా షాకయ్యారు. ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే హాస్పిటల్‌కు చేరుకున్నారు. వికాస్ బాడీని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. అందులో హార్ట్ ఎటాక్ వల్లే అతడు మృతి చెందాడని తేలింది. వికాస్‌కు గతంలో కరోనా సోకిందని తెలిసింది. వికాస్ మృతి ఘటన ఆదివారం జరిగింది. కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కొవిడ్-19తో బాధపడిన వికాస్.. దాని నుంచి కోలుకున్న తర్వాత మరింత ఫిట్‌గా మారాలనే ఉద్దేశంతో తరచూ క్రికెట్ ఆడేవాడట. ఢిల్లీతో పాటు నోయిడాలో జరిగే పలు మ్యాచుల్లోనూ పాల్గొనేవాడట. అలాంటి వికాస్ హఠాత్తుగా గుండెనొప్పితో ప్రాణాలు వదలడంతో అతడి సన్నిహితులు తట్టుకోలేకపోతున్నారు. కాగా, ఈ మధ్య కాలంలో సడన్, సైలెంట్ హార్ట్ ఎటాక్స్ ఎక్కువైన సంగతి తెలిసిందే. క్లాసులో పాఠాలు చెబుతూ టీచర్, కబడ్డీ లాంటి ఆడుతూ యువకుడు హఠాత్తుగా హార్ట్ ఎటాక్ బారిన పడి ప్రాణాలు వదిలిన సంఘటనల గురించి వార్తల్లో వింటూనే ఉన్నాం. సడన్ హార్ట్ ఎటాక్స్ కారణంగా పలువురు సెలబ్రిటీలు కూడా మృత్యువాత బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ టెకీ క్రికెట్ ఆడుతూ పిచ్ మధ్యలో ప్రాణాలు వదలడం షాకింగ్‌గా మారింది.
ఇదీ చదవండి: కావాల్సింది 18.. ప్రపంచంలో తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు!
‼️SHOCKING: Man suffers from heart attack while playing cricket in Noida. Collapses on the pitch and dies.
On Sunday, while playing cricket, Vikas Negi, an engineer, ran towards the other side of the pitch to take a run but collapsed midway.
Witnessing his condition, the… pic.twitter.com/4D5owBA8nS
— truth. (@thetruthin) January 10, 2024
🚨 A 34-year old Vikas Negi from Noida died after suffering a heart attack during a cricket match.#IPL2024 #PAKvsNZ #INDvsAFG pic.twitter.com/3zmrC4XZOa
— Abdullah Neaz (@Neaz__Abdullah) January 10, 2024