iDreamPost
android-app
ios-app

షోయబ్‌ మాలిక్‌కు సానియా ఉసురు! సర్వనాశనం అవుతున్న కెరీర్‌?

  • Published Jan 27, 2024 | 12:43 PM Updated Updated Jan 27, 2024 | 1:14 PM

Shoaib Malik, Sania Mirza: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు విడాకులిచ్చి.. షోయబ్‌ మాలిక్‌ మూడో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం కెరీర్‌ పరంగా మాలిక్‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అవన్నీ సానియా ఉసురు తగిలే అని అంటున్నారు.. వాటిలో నిజమెంతో ఇప్పుడు చూద్దాం..

Shoaib Malik, Sania Mirza: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాకు విడాకులిచ్చి.. షోయబ్‌ మాలిక్‌ మూడో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం కెరీర్‌ పరంగా మాలిక్‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అవన్నీ సానియా ఉసురు తగిలే అని అంటున్నారు.. వాటిలో నిజమెంతో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 27, 2024 | 12:43 PMUpdated Jan 27, 2024 | 1:14 PM
షోయబ్‌ మాలిక్‌కు సానియా ఉసురు! సర్వనాశనం అవుతున్న కెరీర్‌?

పాకిస్థాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ ఇటీవల మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2010లో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను మాలిక్‌ రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సానియా కంటే ముందే ఆయేషా సిద్దిఖీని వివాహం చేసుకుని, ఆమె నుంచి విడిపోయి సానియాను నిఖా చేసుకున్నాడు. తాజాగా సానియాకు కూడా విడాకులు ఇచ్చి.. పాకిస్థాన్‌ నటి సనా జావేద్‌ను మూడో పెళ్లి చేసుకున్నాడు మాలిక్‌. అయితే.. ఈ విషయంలో నెటిజన్లంతా సానియాకే మద్దుతుగా నిలుస్తూ.. మాలిక్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. మాలిక్‌ మూడో పెళ్లి చేసుకోవడం అతని కుటుంబ సభ్యులకు కూడా ఇష్టం లేదని, మాలిక్‌ వివాహేతర సంబంధాలను సానియా చాలా భరించిందని.. అయినా కూడా మాలిక్‌లో మార్పు రాలేదని, అందుకే వారంతా మాలిక్‌ మూడో పెళ్లికి దూరంగా ఉంటూ.. సానియాకే మద్దతుగా నిలిచారనే వార్తలు పాక్‌ మీడియాలో వచ్చాయి.

అయితే.. సనా జావేద్‌ను నిఖా చేసుకున్నట్లు ఇటీవల మాలిక్‌ తన సోషల్‌ మీడియా ఖాతాల్లో ఫొటోలు షేర్‌ చేసి ప్రకటించాడు. ఆ వెంటనే బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పాల్గొన్నాడు మాలిక్‌. కానీ, ఆడిన ఆరంభం మ్యాచ్‌ల్లోనే మాలిక్‌ చెత్త ప్రదర్శన కనబర్చాడు. బంగ్లాదేశ్​ ప్రీమియర్ లీగ్​లో ఫార్చూన్ బరిషల్ టీమ్‌ తరఫున ఆడుతున్న అతడిపై ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో అర్ధంతరంగా టోర్నీ నుంచి వైదొలిగి దుబాయ్‌కి వెళ్లిపోయాడనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ లీగ్‌లో ఓ మ్యాచ్‌లో మాలిక్‌ బౌలింగ్‌ చేస్తూ.. ఓకే ఓవర్‌లో ఏకంగా మూడో నో బాల్స్‌ వేసి, మొత్తం 18 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో.. అతనిపై ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చాయి.

ఈ ఆరోపణల నేపథ్యంలో మాలిక్‌తో కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకునే ఆలోచనలో బీపీఎల్‌ నిర్వాహకులు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. శత్రుదేశానికి చెందిన వ్యక్తి అయినా, స్వదేశం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటాననే విషయం తెలిసినా.. ఎంతో ధైర్యం చేసి సానియా మీర్జా పెళ్లి చేసుకుంటే.. ఆమెను మోసం చేసి, విడాకులిచ్చి, మళ్లీ మూడో పెళ్లి చేసుకున్నాడు కాబట్టే మాలిక్‌ కెరీర్‌ ఇలా ప్రమాదంలో పడిందని అంటున్నారు. మాలిక్‌కు సానియా ఉసురు తగిలిందని పేర్కొంటున్నారు. ప్రాణంగా ప్రేమించే భార్యను మోసం చేయడంతోనే మాలిక్‌కు ఇలాంటి గతి పడుతుందని మండిపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş