Corey Anderson: వీడియో: కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టిన అండర్సన్‌! చూస్తే వావ్‌ అనాల్సిందే..

Corey Anderson: వీడియో: కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టిన అండర్సన్‌! చూస్తే వావ్‌ అనాల్సిందే..

Corey Anderson, MLC 2024, TSK vs SFU, Faf du Plessis: స్టార్‌ క్రికెటర్‌ కోరి అండర్సన్‌ ఓ అద్బుతమైన క్యాచ్‌ పట్టాడు. అది చూస్తే ఏ క్రికెట్‌ ఫ్యాన్‌ అయినా వావ్‌ అనాల్సిందే. ఆ క్యాచ్‌ గురించి మరిన్ని విశేషాలు ఇప్పుదు తెలుసుకుందాం..

Corey Anderson, MLC 2024, TSK vs SFU, Faf du Plessis: స్టార్‌ క్రికెటర్‌ కోరి అండర్సన్‌ ఓ అద్బుతమైన క్యాచ్‌ పట్టాడు. అది చూస్తే ఏ క్రికెట్‌ ఫ్యాన్‌ అయినా వావ్‌ అనాల్సిందే. ఆ క్యాచ్‌ గురించి మరిన్ని విశేషాలు ఇప్పుదు తెలుసుకుందాం..

అంతర్జాతీయి క్రికెట్‌లో ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు చోటు చేసుకున్నాయి. కానీ, ఓ ఫీల్డర్‌ అద్భుతమైన విన్యాసంతో సూపర్‌ క్యాచ్‌తో పట్టిన ప్రతిసారి క్రికెట్‌ అభిమానులు.. మెస్మరైజ్‌ అవుతూనే ఉంటారు. అలాంటి ఓ క్యాచ్‌ తాజాగా చోటు చేసుకుంది. అయితే.. ఇది ఓ ఫ్రాంచైజ్‌ లీగ్‌ క్రికెట్‌లో జరిగింది. అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2024లో భాగంగా టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌, శాన్‌ఫ్రాన్సిస్కో యానికార్న్‌స్‌ జట్ల మధ్య జరిగిన ఛాలెంజర్‌(క్వాలిఫైయర్‌-2) మ్యాచ్‌లో కోరి అండర్సన్‌ అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు.

సూపర్‌ బ్యాటింగ్‌తో అదరగొడుతున్న టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ను.. తన సూపర్‌ డూపర్‌ క్యాచ్‌తో పెవిలియన్‌కు పంపాడు అండర్సన్‌. కార్మి లే రౌక్స్ వేసిన ఇన్నింగ్స్‌ 5వ ఓవర్‌ రెండో బంతికి డుప్లెసిస్‌ మిడాఫ్‌ దిశగా గాల్లోకి షాట్‌ ఆడాడు. అది థర్డీ యార్డ్ సర్కిల్‌కి కొత్త దూరంగా గాల్లోకి వెళ్తోంది. ఆ బాల్‌ను అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న కోరి అండర్సన్‌ అద్భుతంగా గాల్లోకి ఎగరడమే కాకుండా.. తన ఎడమ చేతిలో అసాధ్యమైన క్యాచ్‌ను పట్టి ఔరా అనిపించాడు. ఆ క్యాచ్‌ చూస్తే ఎవరైనా వావ్‌ అనాల్సిందే. కొంతమంది క్రికెట్‌ అభిమానులు ఆ క్యాచ్‌ క్రికెట్‌ హిస్టరీలోనే వండర్‌ క్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు. ఆ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శాన్‌ఫ్రాన్సిస్కో యానికార్న్‌స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. 53 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సులతో 101 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. జోస్‌ ఇంగ్లిస్‌ 37, హసన్‌ ఖాన్‌ 27 పరుగులతో రాణించారు. సూపర్‌ కింగ్స్‌ బౌలర్లలో నూర్‌ అహ్మద్‌ 3 వికెట్లతో రాణించాడు. ఇక 201 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 190 పరుగులు మాత్రమే చేసి 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్లు డెవాన్‌ కాన్వె 62, కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ 45, జోషువా ట్రోంప్‌ 56 పరుగులు చేసి రాణించినా.. మ్యాచ్‌ను గెలిపించలేకపోయారు. ఈ ఓటమితో టెక్సాస్‌ ఇంటికి వెళ్లింది. శాన్‌ఫ్రాన్సిస్కో ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరి ఈ మ్యాచ్‌లో అండర్సన్‌ పట్టిన అద్భుతమైన క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments