వీడియో: క్రిస్‌ వోక్స్‌ బాల్‌ను టచ్‌ చేసేందుకు భయపడుతున్న లంక బ్యాటర్లు!

Chris Woakes, ENG vs SL: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్‌ స్పీడ్‌ బౌలర్ క్రిస్‌ ఓక్స్‌ నిప్పులు చెరుగుతున్నాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కూల్చాడు. అతని బౌలింగ్‌ గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం..

Chris Woakes, ENG vs SL: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్‌ స్పీడ్‌ బౌలర్ క్రిస్‌ ఓక్స్‌ నిప్పులు చెరుగుతున్నాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కూల్చాడు. అతని బౌలింగ్‌ గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం..

మూడు టెస్టుల సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లండ్‌ వెళ్లిన శ్రీలంక జట్టుకు తొలి టెస్టులోనే క్రిస్‌ వోక్స్‌ వణికిస్తున్నాడు. తన పదునైన పేస్‌తో హేమాహేమీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన క్రిస్‌ వోక్స్‌.. ఇప్పుడు లంక బ్యాటర్లను.. తన సొంత గడ్డపై భయపెడుతున్నాడు. అతని బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు లంక బ్యాటర్లు బెంబేలెత్తిపోతున్నారు. లంకలోని స్పిన్‌ పిచ్‌లకు బాగా అలవాటు పడిపోయిన లంకేయులు.. ఇప్పుడు ఇంగ్లండ్‌లోని ఫాస్ట్‌ పిచ్‌లపై క్రిస్‌ వోక్స్‌ లాంటి స్పీడ్‌ బౌలర్‌ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడుతున్నారు.

మాంచెస్టర్‌ వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో టాస్‌ గెలిచిన శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అలా బ్యాటింగ్‌కు దిగిన లంకను.. ఇలా పెవిలియన్‌ చేర్చే పనిలో పడ్డాడు క్రిస్‌ వోక్స్‌. ఒకే ఓవర్‌లో ఏకంగా రెండు వికెట్లు పడగొట్టి.. లంకను దారుణంగా దెబ్బతీశాడు. అతను వేసిన ఇన్నింగ్స్‌ 7 ఓవర్‌ తొలి బంతికే.. నిషాన్ మదుష్కాను అవుట్‌ చేశాడు. ఫుల్‌ అవుట్‌ సైడ్‌ ది ఆఫ్‌ స్టెంప్‌గా వేసిన బాల్‌ను నిషాన్ మదుష్కా వేటాడి స్లిప్‌లో ఉన్న జో రూట్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో.. శ్రీలంక కేవలం 6 పరుగులకే రెండో వికెట్‌ కోల్పోయింది.

ఇక అదే ఓవర్‌లో చివరి బంతికి ఏంజిలో మ్యాథ్యూస్‌ను పెవిలియన్‌ చేర్చాడు ఓక్స్‌. అప్పుడే క్రీజ్‌లోకి వచ్చి.. తన బౌలింగ్‌ను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడుతున్న మ్యాథ్యూస్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు ఓక్స్‌. అతని దెబ్బకు కేవలం 6 పరుగులకే 3వ వికెట్‌ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది శ్రీలంక. మరో విశేషం ఏంటంటే.. ఆ ఓవర్‌లో ఓక్స్‌ ఒక్క రన్‌ కూడా ఇవ్వలేదు. మెయిడెన్‌ ఓవర్‌ వేసి రెండు వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లు ముగిసే సరికి.. 5 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది లంక. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ ఓక్స్‌ 2, మార్క్‌ వుడ్‌, షోయబ్‌ బషీర్‌, గుస్ అట్కిన్సన్ తలో వికెట్‌ పడగొట్టారు. క్రిస్‌ ఓక్స్‌ మరోసారి చెలరేగితే.. లంక ఎక్కువ సేపు ఇన్నింగ్స్‌ కొనసాగించేలా కనిపించడం లేదు. మరి ఈ మ్యాచ్‌లో ఓక్స్‌ బౌలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments