iDreamPost
android-app
ios-app

MS Dhoni: వీడియో: ధోని సాయంపై స్పందించిన స్నేహితుడు.. ఏమన్నాడంటే?

  • Published Feb 13, 2024 | 3:19 PM Updated Updated Feb 13, 2024 | 3:19 PM

చిన్నతనంలో సాయం చేసిన ఫ్రెండ్ కు ఇటీవలే హెల్ప్ చేశాడు ధోని. ఈ సాయంపై తాజాగా స్పందించాడు ధోని చిన్ననాటి స్నేహితుడు పరమ్ జిత్ సింగ్. అతడు ఏమన్నాడంటే?

చిన్నతనంలో సాయం చేసిన ఫ్రెండ్ కు ఇటీవలే హెల్ప్ చేశాడు ధోని. ఈ సాయంపై తాజాగా స్పందించాడు ధోని చిన్ననాటి స్నేహితుడు పరమ్ జిత్ సింగ్. అతడు ఏమన్నాడంటే?

MS Dhoni: వీడియో: ధోని సాయంపై స్పందించిన స్నేహితుడు.. ఏమన్నాడంటే?

మహేంద్రసింగ్ ధోని.. ప్రపంచ క్రికెట్ లో ఎంత గొప్ప క్రికెటరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. టీమిండియాకు తన కెప్టెన్సీలో మూడు ఐసీసీ ట్రోఫీలను అందించి.. దశాబ్దాల కలను నెరవేర్చాడు. ఇక క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత తనకు ఇష్టమైన వ్యాపకాలపై టైమ్ స్పెండ్ చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఒక్క ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు ధోని. అయితే జీవితంలో తాను ఎంత ఎత్తుకు ఎదిగినా కానీ.. తన మూలాలను మాత్రం మర్చిపోలేదు ఈ జార్ఖండ్ డైనమెట్. తనకు చిన్నతనంలో సాయం చేసిన ఫ్రెండ్ కు ఇటీవలే హెల్ప్ చేశాడు ధోని. ఈ సాయంపై తాజాగా స్పందించాడు ధోని చిన్ననాటి స్నేహితుడు పరమ్ జిత్ సింగ్.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన చిన్ననాటి స్నేహితుడికి ఇటీవలే సాయం చేసిన విషయం తెలిసిందే. చిన్నతనంలో తనకు హెల్ప్ చేసిన ఫ్రెండ్ కు సాయం చేసి రుణం తీర్చుకున్నాడు. ధోని లాంటి దిగ్గజ ఆటగాడు తలచుకుంటే ప్రపంచంలోని ఎంతో పెద్ద పెద్ద బ్యాట్ల కంపెనీలు స్పాన్సర్ చేయడానికి ముందుకు వస్తాయి. కానీ వాటినీ కాదని తన స్నేహితుడి షాప్ పేరుతో ఉన్న బ్యాట్ తో తాజాగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఆ ఫొటోలు కాస్త వైరల్ గా మారడంతో.. ధోని తన ఫ్రెండ్ పరమ్ జిత్ సింగ్ కు చేసిన సాయం అందరికి తెలిసింది. దీంతో అతడి ‘ప్రైమ్ స్పోర్ట్స్’ షాప్ కు ఎక్కడాలేని పబ్లిసిటీ వచ్చింది. ఇక ఈ విషయంపై తాజాగా స్పందించాడు పరమ్ జిత్ సింగ్.

“ధోని స్నేహితుడిగా నేనెంతో గర్వపడుతున్నాను. అతడెప్పుడు మాకు అండగానే, మాతోనే ఉంటాడు. అది మా స్నేహం గొప్పదనం. ధోని నా షాప్ కు పబ్లిసిటీ కలిగించడంతో పాటుగా నాకు అతడు సంతకం చేసిన బ్యాట్ ను బహుమతిగా ఇచ్చాడు. నాకెంతో ఆనందంగా ఉంది” అంటూ ఒక్కింత భావోద్వేగానికి లోనైయ్యాడు పరమ్ జిత్ సింగ్. ప్రస్తుతం అతడు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: విజ‌య్ దేవ‌ర‌కొండపై PV సింధు షాకింగ్ స్టేట్మెంట్! ఇలా అనేసింది ఏంటి?

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler