Champions Trophy Will India Travel To Pakistan: భారత్​కు పాక్ మాజీ క్రికెటర్ అల్టిమేటం.. ఏం అనుకుంటున్నారంటూ!

భారత్​కు పాక్ మాజీ క్రికెటర్ అల్టిమేటం.. ఏం అనుకుంటున్నారంటూ!

Team India: టీ20 ప్రపంచ కప్-2024 టైటిల్ నెగ్గిన భారత్ ఫుల్ జోష్​లో ఉంది. 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న కప్పు దరికి చేరడంతో సంతోషంతో సంబురాలు చేసుకుంటోంది.

Team India: టీ20 ప్రపంచ కప్-2024 టైటిల్ నెగ్గిన భారత్ ఫుల్ జోష్​లో ఉంది. 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న కప్పు దరికి చేరడంతో సంతోషంతో సంబురాలు చేసుకుంటోంది.

టీ20 ప్రపంచ కప్-2024 టైటిల్ నెగ్గిన భారత్ ఫుల్ జోష్​లో ఉంది. 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న కప్పు దరికి చేరడంతో సంతోషంతో సంబురాలు చేసుకుంటోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా లాంటి దిగ్గజాలు కప్పు కలను నెరవేర్చుకోవడంతో దేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. పొట్టి కప్పు ఫైనల్ ముగిశాక అభిమానులు ఫుల్​గా సెలబ్రేట్ చేసుకున్నారు. రోడ్ల మీదకు వచ్చి క్రాకర్స్ కాలుస్తూ, స్వీట్లు పంచుతూ హల్​చల్ చేశారు. భారత్ మాతా కీ జై అంటూ నినదించారు ఫ్యాన్స్. ఐసీసీ ట్రోఫీలు నెగ్గడంలో ఇది మొదటి అడుగని.. ఇక మీదట అన్ని టైటిల్స్ మనమే కొట్టాలని అంటున్నారు అభిమానులు. ఇదే జోరును కొనసాగించి గ్రేటెస్ట్ ఛాంపియన్స్​గా నిలవాలని చెబుతున్నారు.

టీ20 క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు వన్డేలు, టెస్టులపై ఇక మీదట ఫుల్ ఫోకస్ చేయనున్నారు. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నారు. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ మిస్సైన నేపథ్యంలో అదే ఫార్మాట్​లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీని అస్సలు వదులుకోవద్దని అనుకుంటున్నారు. ఈ తరుణంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ పాక్​కు రావాల్సిందేనని అల్టిమేటం జారీ చేశాడు. అసలు ఏం అనుకుంటున్నారని, ఇతర దేశాల్లాగే టీమిండియా కూడా ఓ క్రికెటింగ్ నేషన్ అని.. దీన్ని గుర్తుంచుకోవాలంటూ సీరియస్ అయ్యాడు. ఈ విషయంలో ఐసీసీ ఏం చేస్తుందనేది అందరూ నిశితంగా గమనిస్తున్నారని పేర్కొన్నాడు భట్.

ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే ఆ దేశంతో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఆ టోర్నమెంట్​కు భారత్ వెళ్లడం కష్టమే. టీమిండియా ఆడాల్సిన మ్యాచుల్ని పాక్ నుంచి దుబాయ్ లేదా శ్రీలంకకు మార్చాలంటూ ఐసీసీకి బీసీసీఐ రిక్వెస్ట్ చేసిందంటూ గతంలో వార్తలు వచ్చాయి. బోర్డు ఏం చెబితే అదే నడుస్తుంది, కాబట్టి ఈ టోర్నీని తరలించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సల్మాన్ భట్ రియాక్ట్ అయ్యాడు. భారత్ సహా అన్ని జట్లు పాక్​కు వచ్చేలా చేయడం ఐసీసీ బాధ్యత అన్నాడు భట్. టోర్నీ కోసం టీమిండియా పాక్​కు వస్తే స్వాగతం చెబుతామని, ఒకవేళ రాలేదంటే ఈ విషయాన్ని ఐసీసీకే వదిలేస్తామని స్పష్టం చేశాడు. ఇతర దేశాలతో ఒకలా, భారత్ విషయంలో మరోలా ఉంటే మాత్రం ఒప్పుకోమన్నాడు. దీన్ని బట్టే ఇండియా విషయంలో ఐసీసీ వైఖరి ఎలాంటిదో బయటపడుతుందన్నాడు.

Show comments