Shakib Al Hasan: బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్‌ అల్‌ హసన్‌‌పై హత్య కేసు నమోదు!

Case Filed On Shakib Al Hasan: బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్‌ అల్‌ హసన్ మీద కేసు నమోదైంది. ఏంటా కేసు? అసలు షకీబ్ చేసిన నేరం ఏంటి? అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Case Filed On Shakib Al Hasan: బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్‌ అల్‌ హసన్ మీద కేసు నమోదైంది. ఏంటా కేసు? అసలు షకీబ్ చేసిన నేరం ఏంటి? అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ మీద మర్డర్ కేసు నమోదవడం సంచలనంగా మారింది. షకీబ్ పై కేసు అనగానే అసలేం జరిగింది? అతడు చేసిన నేరం ఏంటి? ఎవరు కేసు వేశారు? లాంటి వివరాలను కనుక్కునే పనిలో పడ్డారు క్రికెట్ లవర్స్. బౌలింగ్, బ్యాటింగ్ తో అదరగొట్టే షకీబ్ పై కేసు వేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు షకీబ్ కేసు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.. స్వదేశంలో షకీబ్ మీద కేసు నమోదైంది. రఫీకుల్ ఇస్లామ్ అనే వ్యక్తి ఈ కేసు పెట్టారు. బంగ్లాదేశ్ లో ఆగస్టు 7వ తేదీన జరిగిన ర్యాలీలో రఫీకుల్ కుమారుడు రూబెల్ మృతి చెందాడు.

అడోబార్ రింగ్ రోడ్డులో జరిగిన ర్యాలీ టైమ్ లో రూబెల్ చనిపోయాడు. ఈ ఘటన మీద అడోబార్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ మర్డర్ కేసులో 28వ నిందితుడిగా షకీబ్ అల్ హసన్ పేరును చేర్చారు. బంగ్లాదేశ్ ఫేమస్ సింగర్ ఫెర్దౌస్ అహ్మద్ ను 55వ నిందితుడిగా చేర్చారు. వీళ్లిద్దరూ అవామీ లీగ్ పార్టీకి చెందిన మాజీ ఎంపీలు కావడం గమనార్హం. రూబెల్ హత్య కేసులో మొత్తం 154 మంది నిందితుల్ని చేర్చారు. ఇందులో బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా కూడా ఉన్నారు. ఈ మర్డర్ కేసులో మరో 500 మంది గుర్తు తెలియని వ్యక్తుల్ని నిందితులుగా చేర్చారు. ఇక, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇటీవల బంగ్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ అల్లర్లలోనే రూబెల్ అనే యువకుడు చనిపోయాడు. దీంతో అతడి తండ్రి రఫీకుల్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు.

అల్లర్ల నేపథ్యంలో హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. దీంతో షకీల్ అల్ హసన్ ఎంపీ పదవిని కోల్పోయాడు. ఒకవైపు ఎంపీ పోస్ట్ పోవడంతో బాధలో ఉన్న తరుణంలో మరోవైపు హత్య కేసు నమోదవడం గట్టి షాక్ అనే చెప్పాలి. ప్రస్తుతం పాకిస్థాన్ టూర్ లో ఉన్నాడు షకీబ్. పాక్ తో సిరీస్ తో కమ్ బ్యాక్ ఇచ్చిన ఈ ఆల్ రౌండర్ ఫస్ట్ టెస్ట్ లో ఫ్లాప్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో 27 ఓవర్లు వేసి 100 పరుగులు ఇచ్చి కేవలం ఒకే వికెట్ పడగొట్టాడు. వికెట్లు తీయకపోవడమే గాక పరుగులు కూడా భారీగా సమర్పించుకున్నాడు. ఎలా బ్యాటింగ్ చేస్తాడోనని అభిమానులు అనుకుంటున్న వేళ హత్య కేసు నమోదుతో మరోమారు వార్తల్లో నిలిచాడు షకీబ్.

Show comments