iDreamPost
android-app
ios-app

భారత క్రికెట్‌లో షేర్‌‘ఖాన్‌’ల గర్జన! ఇండియాకు కలిసి ఆడటమే మిగిలింది!

  • Published Jan 25, 2024 | 8:05 PM Updated Updated Jan 25, 2024 | 8:05 PM

Sarfaraz Khan – Musheer Khan: టీమిండియా క్రికెట్ లో షేర్ ఖాన్ లు గర్జించారు. అన్నదమ్ములిద్దరూ ఒకేరోజు సెంచరీలతో చెలరేగారు.

Sarfaraz Khan – Musheer Khan: టీమిండియా క్రికెట్ లో షేర్ ఖాన్ లు గర్జించారు. అన్నదమ్ములిద్దరూ ఒకేరోజు సెంచరీలతో చెలరేగారు.

  • Published Jan 25, 2024 | 8:05 PMUpdated Jan 25, 2024 | 8:05 PM
భారత క్రికెట్‌లో షేర్‌‘ఖాన్‌’ల గర్జన! ఇండియాకు కలిసి ఆడటమే మిగిలింది!

సర్ఫరాజ్ ఖాన్.. టీమిండియా దేశవాళీ క్రికెట్ లో పరిచయం అక్కర్లేని పేరు. తనదైన బ్యాటింగ్ తోనే కాకుండా తన యాటిట్యూడ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గ్రౌండ్ లో కొన్ని కొన్నిసార్లు అత్యుత్సాహం ప్రదర్శించడంతో.. సెలక్టర్ల ఆగ్రహానికి గురై.. జట్టులో చోటు సంపాదించుకోవడానికి కష్టపడుతున్నాడు. ఇక సర్ఫరాజ్ తమ్ముడు కూడా క్రికెటరే కావడం గమనార్హం. అతడి పేరు ముషీర్ ఖాన్. ప్రస్తుతం టీమిండియా-19 జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. కాగా.. అన్నదమ్ములిద్దరూ ఒకేరోజు సెంచరీలతో చెలరేగారు. ఆ వివరాల్లోకి వెళితే..

టీమిండియా క్రికెట్ లో షేర్ ఖాన్ లు గర్జించారు. అన్నదమ్ములిద్దరూ ఒకేరోజు సెంచరీలతో చెలరేగారు. గత రెండేళ్లుగా టీమిండియాలో చోటు సంపాదించుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు సర్ఫరాజ్ ఖాన్. ఈ క్రమంలోనే అక్కడ ప్లేస్ దక్కకపోయినా.. దేశవాళీ క్రికెట్ లో మాత్రం దుమ్మురేపుతూ వస్తున్నాడు ఈ స్టార్ ప్లేయర్. ప్రస్తుతం ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో జరుగుతున్న రెండో అనధికార టెస్ట్ లో సెంచరీతో అదరగొట్టాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో 160 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు, 5 సిక్సర్లతో 161 పరుగులు చేశాడు సర్ఫరాజ్. దీంతో ఇండియా ఏ భారీ స్కోర్ చేసింది.

ఇదిలా ఉండగా.. సర్ఫరాజ్ ఫ్యామిలీకి మరో గుడ్ న్యూస్ అందింది. సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ లో టీమిండియాలో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఇక ఈ వరల్డ్ కప్ లో భాగంగా తాజాగా ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన శతకంతో చెలరేగాడు. దీంతో టీమిండియా-19 జట్టు 7 వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ 106 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్ లతో 118 పరుగులు చేశాడు. అటు అన్న, ఇటు తమ్ముడు ఇద్దరూ ఒకేరోజు సెంచరీ చేయడంతో.. సర్ఫరాజ్ కుటుంబంలో ఆనందాలు వెళ్లివిరిశాయి. ఇదిలా ఉండగా.. ఇటీవలే బంగ్లాదేశ్ తో ముగిసిన మ్యాచ్ లో బ్యాటింగ్ లో విఫలం అయ్యాడు ముషీర్. కానీ బౌలింగ్ లో అదరగొట్టాడు. సర్ఫరాజ్ బ్యాటర్ గా రాణిస్తుంటే.. ముషీర్ ఖాన్ ఆల్ రౌండర్ గా సత్తాచాటుతున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి ఫామ్ చూస్తుంటే త్వరలోనే టీమిండియాకు ఇద్దరూ కలిసి ఆడే రోజులు ముందున్నాయని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఒకే రోజు అన్నదమ్ములిద్దరూ సెంచరీలతో చెలరేగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet