వరల్డ్ కప్ ఓడినా టీమిండియాకి భారీ మద్దతు! 48 ఏళ్లలో ఇదే తొలిసారి!

వరల్డ్ కప్ 2023లో ఓడినా కూడా 48 ఏళ్లలో చూడలేని ఒక పరిస్థితిని ఇప్పుడు ఇండియాలో చూస్తున్నాం. నిజంగా ఇది చాలా గొప్ప పరిణామం అనే చెప్పాలి.

వరల్డ్ కప్ 2023లో ఓడినా కూడా 48 ఏళ్లలో చూడలేని ఒక పరిస్థితిని ఇప్పుడు ఇండియాలో చూస్తున్నాం. నిజంగా ఇది చాలా గొప్ప పరిణామం అనే చెప్పాలి.

వరల్డ్ కప్ 2023 ఈసారికి అందని ద్రాక్షగా మిగిలిపోయింది. కప్పు కొట్టాలని, 20 ఏళ్ల ప్రతీకారాన్ని తీర్చుకోవాలని ఉవ్విళ్లూరిన టీమిండియాకి నిరాశే ఎదురైంది. వరుస విజయాలతో దూకుడుగా ఉన్న భారత జట్టు ఈసారి కప్పు కొడుతుందని 140 కోట్ల మంది భారతీయులు కూడా బలంగానే ఫిక్స్ అయ్యారు. అయితే ఆశలన్నీ అడియాసలు అయ్యాయి. ఆరోసారి వరల్డ్ కప్ ని లిఫ్ట్ చేసి తిరుగులేని ఛాంపియన్స్ గా ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. ఈ నేపథ్యంలోనే 48 ఏళ్లలో చూడలేని ఒక సంఘటనను ఈసారి చూస్తున్నాం. ఇండియన్ టీమ్ కి భారీ మద్దతు లభిస్తోంది. అందరూ మేము మీ వెంటే అంటూ బాసటగా నిలుస్తున్నారు.

భారత్ లో క్రికెట్ అంటే ఆట కాదు.. అదొక ఎమోషన్. టీమిండియా గెలిస్తే సంబరాలు చేసుకోవడం, ఓటమి పాలైతే కన్నీరుమున్నీరుగా ఏడవడం చూస్తూనే ఉంటాం. వరల్డ్ కప్ లో ఇండియా ఓడిపోవడం తట్టుకోలేక తిరుపతిలో ఐటీ ఉద్యోగి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. మన దేశంలో వరల్డ్ కప్ అంటే అది కేవలం ట్రోఫీ మాత్రమే కాదు.. మన ఆత్మగౌరవంతో సమానం. అలాంటి కప్పును గెలవడంలో టీమిండియా తడబడింది. ఆఖరి మజిలీలో పోరాడి ఓడింది. అయితే వరల్డ్ కప్ లో ఓటమి మనకి కొత్తా అంటే.. అలా ఏం కాదు. గతంలో కూడా ఇదే ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఫైనల్ లోనే ఓటమి పాలయ్యాం. అయితే అప్పటికి.. ఇప్పటికి ఒక స్పష్టమైన తేడా ఉంది. అదేంటంటేం భారతీయుల ఆలోచనల్లో మార్పు. క్రికెట్ ని ఇంతలా ఆరాదించే దేశంలో ఒక కప్పు కోల్పోయాం అనగానే అభిమానుల్లో ఆగ్రహం పెరిగిపోతుంది. కోపం కట్టలు తెంచుకుంటుంది. నెట్టింట తిట్ల దండకాలు అందుకుంటారు. కొన్నిసార్లు ఏకంగా ఆటగాళ్ల ఇళ్లపై రాళ్లతో దాడులు చేసిన సందర్భాలు కూడా చూశాం.

ఒక్క ఆటగాళ్లనే కాదు.. హెడ్ కోచ్ నుంచి సపోర్టింగ్ స్టాఫ్, బీసీసీఐ వరకు అందరినీ తిట్టిపోస్తారు. ఎందుకంటే వారు దానిని కేవలం ఒక ఆటలా చూడడం లేదు కాబట్టి. వారి బాధలో కూడా ఒక అర్థం ఉందని ఆటగాళ్లు కూడా సర్దుకుపోతారు. అయితే ఈ వరల్డ్ కప్ లో మాత్రం అలాంటి ప్రవర్తనలు చూడలేదు. ఎక్కడ చూసినా కూడా భారత ఆటగాళ్లకు భారీగా మద్దతు లభిస్తోంది. నెట్టింట కూడా మేము మీతోనే ఉన్నాం అంటూ పోస్టులు పెడుతున్నారు. గెలుపైనా.. ఓటమైనా మేము మాత్రం మీ వెంటే అంటాం అంటూ టీమిండియాకి బాసటగా నిలుస్తున్నారు. ప్రధాని మోదీ మొదలు.. సెలబ్రిటీలు, ప్రముఖులు, హీరోలు, దిగ్గజ క్రికెటర్లు అందరూ భారత జట్టుకు మద్దతు తెలుపుతున్నారు. నిజానికి ఈ 48 ఏళ్లలో ఇలాంటి ఒక పరిస్థితిని చూసుండరు. చివరిగా టీమిండియాకి భారతీయ అభిమానుల నుంచి చెప్పే మెసేజ్ ఒక్కటే.. గెలుపు, ఓటములు అనేవి వస్తాయి, పోతాయి. పోరాటం అనేది మీ ఊపిరిలోనే ఉంది. దాన్ని కంటిన్యూ చేయండి. పోరాటం మీ ఊపిరి అయితే గెలుపు మీకు దాసోహం అంటుంది. టీమిండియా మేమెప్పుడూ మీవెంటే.

Show comments