Virat Kohli: కోహ్లీ వైఫల్యంపై స్పందించిన హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌! ఏమన్నాడంటే..?

Virat Kohli, Rahul Dravid: ప్రస్తుత వరల్డ్‌ కప్‌లో పరుగులు చేయడంలో విఫలం అవుతున్న టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ ​కోహ్లీ గురించి హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. మరి ఆయన ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

Virat Kohli, Rahul Dravid: ప్రస్తుత వరల్డ్‌ కప్‌లో పరుగులు చేయడంలో విఫలం అవుతున్న టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ ​కోహ్లీ గురించి హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. మరి ఆయన ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా సూపర్‌ విక్టరీ సాధించి.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా గురువారం రాత్రి గయానా వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 68 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో శనివారం సౌతాఫ్రికాతో తుది పోరుకు సిద్ధమైంది రోహత్‌ సేన. టీ20 వరల్డ్‌ కప్‌ 2022 సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఎదురైన ఓటమికి ఈ విజయంతో బదులు తీర్చుకుంది టీమిండియా. కాగా, ఈ టోర్నీలో పూర్‌ ఫామ్‌లో కొనసాగుతున్న విరాట్‌ కోహ్లీ.. ఈ మ్యాచ్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. అయితే.. కోహ్లీ వైఫల్యంపై టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

‘విరాట్‌ కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో మనందరికి తెలిసిందే. అయితే.. కొన్ని సార్లు ఎక్కువ రిస్క్‌ తీసుకొని ఆడుతున్న సమయంలో ప్రతి సారి కలిసి రాకపోవచ్చు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కోహ్లీ అగ్రెసివ్‌ బ్రాండ్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో అతను అద్భుతమైన సిక్స్‌ కొట్టాడు. కానీ దురదృష్టవశాత్తు తర్వాతి బంతి కొంచెం ఎక్కువ సీమ్‌ అయింది. కానీ, అతని ఇంటెంట్‌ బాగా నచ్చింది. కోహ్లీ అగ్రెసివ్‌ ఇంటెంట్‌తో ఆడటాన్ని మెచ్చుకోవాలి. కోహ్లీ చూపిస్తున్న ఇంటెంట్‌.. మిగతా ప్లేయర్లకు ఒక ఎగ్జామ్‌పుల్‌గా ఉంటుంది. అయితే.. ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్తున్నాను.. ఫైనల్‌లో కోహ్లీ నుంచి మాత్రం ఒక భారీ ఇన్నింగ్స్‌ రాబోతుంది’ అని రాహుల్‌ ద్రవిడ్‌ పేర్కొన్నాడు.

ఈ టోర్నీ మొత్తం కోహ్లీ చేసిన అత్యధిక స్కోర్‌ 37 పరుగులు. అది సూపర్‌ 8లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చేశాడు. అయితే.. ఈ టోర్నీలో కోహ్లీ తన స్థాయికి తగ్గట్లు ఆడటం లేదనే విషయం ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. అయితే.. అగ్రెసివ్‌గా ఆడే క్రమంలోనే కోహ్లీ త్వరగా అవుట్‌ అవుతున్నాడంటూ క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. పైగా టీమిండియా ఈ వరల్డ్‌ కప్‌ టోర్నీలో రోహిత్‌కు జోడీగా యశస్వి జైస్వాల్‌ను కాదని, కోహ్లీని ఓపెనర్‌గా ఆడిస్తోంది. అది కూడా కోహ్లీపై కాస్త ఒత్తిడి పెడుతున్న మాట వాస్తవం. అయినా కూడా ఓపెనర్‌గా ఆడటం కోహ్లీకి కొత్త కాదు. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున ఓపెనర్‌గా ఆడుతున్నాడు, టీమిండియా తరఫున చాలా సార్లు ఓపెనర్‌గా ఆడాడు. మరి కోహ్లీ ఫైనల్‌లో పెద్ద స్కోర్‌ చేస్తాడని రాహుల్‌ ద్రవిడ్‌ జోస్యం చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments