iDreamPost
android-app
ios-app

బ్రూక్ అవుట్! స్టోక్స్ బాధ చూశారా? ఇంత గొప్ప మనసా?

  • Published Oct 05, 2023 | 6:42 PM Updated Updated Oct 05, 2023 | 6:42 PM
  • Published Oct 05, 2023 | 6:42 PMUpdated Oct 05, 2023 | 6:42 PM
బ్రూక్ అవుట్! స్టోక్స్ బాధ చూశారా? ఇంత గొప్ప మనసా?

వన్డే ప్రపంచకప్-2023 సంగ్రామం మొదలయ్యింది. దీనిలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య ఫస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. కాగా ఈ మ్యాచ్ లో జో రూట్ అద్భుతమైన బ్యాటింగ్ తో మెరుపులు మెరిపించాడు. 86 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 77 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించాడు. అయితే ఈ మ్యాచ్ లో దూకుడుగా ఆడిన హ్యారీ బ్రూక్ ఔటవడంతో డగౌట్ లో ఉన్న బెన్ స్టోక్స్ బాధపడుతూ నిరాశ చెందాడు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

న్యూజీలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో హ్యారీ బ్రూక్ 16 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్ తో 25 పరుగులు చేసి రచిన్ రవీంద్ర బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి కాన్వేకు క్యాచ్ ఇచ్చాడు. వరుసగా 4,4,6 బాదిన బ్రూక్ ఆ తర్వాత బాల్ ను షాట్ ఆడే క్రమంలో రచిన్ రవీంద్రకు దొరికిపోయాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో బ్రూక్ పెవిలియన్ బాటపట్టడంతో బెన్ స్టోక్స్ తీవ్ర నిరాశకు లోనయ్యాడు. బ్రూక్ ఔటవ్వకపోయుంటే బాగుండేది అన్నట్టుగా తన ఎక్స్ ప్రెషన్స్ ని ఇచ్చాడు స్టోక్స్.

అయితే స్టోక్స్ ప్లేస్ లోనే బ్రూక్ ఆడుతున్నాడు. ఈ క్రమంలో బ్రూక్ ఏమాత్రం పేలవమైన ప్రదర్శన కనబర్చినా వెంటనే ఆ ప్లేస్ లోకి స్టోక్స్ కు స్థానం లభిస్తోంది. కాగా బ్రూక్ ఔటవ్వడం స్టోక్స్ కు కలిసొచ్చే అంశమే అయినప్పటికి అవేమీ పట్టించుకోకుండా టీమ్ గెలుపే లక్ష్యమన్నట్లు టీమ్ స్పిరిట్ ని చాటుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బ్రూక్ ఔటవ్వడంతో స్టోక్స్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio