iDreamPost
android-app
ios-app

ఈ ప్రపంచంలో దాని కంటే విలువైనది ఏదీ లేదు: విరాట్‌ కోహ్లీ

  • Published Jun 01, 2024 | 2:50 PM Updated Updated Jun 01, 2024 | 2:50 PM

Virat Kohli, Akaay, Vamika: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ.. ప్రపంచంలో అత్యంత విలువైనది అదే అంటూ చాలా ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశాడు. మరి కోహ్లీ దేని గురించి అన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli, Akaay, Vamika: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ.. ప్రపంచంలో అత్యంత విలువైనది అదే అంటూ చాలా ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశాడు. మరి కోహ్లీ దేని గురించి అన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jun 01, 2024 | 2:50 PMUpdated Jun 01, 2024 | 2:50 PM
ఈ ప్రపంచంలో దాని కంటే విలువైనది ఏదీ లేదు: విరాట్‌ కోహ్లీ

క్రికెట్‌ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. వెస్టిండీస్‌, అమెరికా సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే.. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ముందు టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచంలోనే అత్యంత విలువైనది అదే అని విరాట్‌ కోహ్లీ చేసిన కామెంట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఇంతకీ కోహ్లీ దేని గురించి చెప్పాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

విరాట్‌ కోహ్లీ ఆటను ఎంత ప్రేమిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్రౌండ్‌లోకి దిగితే గేమ్‌ తప్పా.. ఇంకోటి ఏం ఉండదు అతని మైండ్‌లో అని అతనే అనేక సందర్భాల్లో వెల్లడించాడు. ఆటతో పాటు.. తన కుటుంబానికి కూడా కోహ్లీ అంతే ప్రాధాన్యతను ఇస్తాడు. ఆట నుంచి కాస్త విరామం దొరికినా కోహ్లీ చేసే పని తన కుటుంబంతో గడపడం. విరాట్‌ కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా తన ప్రొఫెషన్‌తో ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబానికి సరైన సమయం కేటాయిస్తూ.. ఉత్తమ ఇల్లాలుగా పేరు తెచ్చుకుంది. విరాట్‌ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్న విషయం తెలిసిందే.

విరుష్క దంపతులు.. తమ పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఇప్పటి వరకు కొడుకు ఫొటో కూడా బయటికి రాకుండా కేర్‌ తీసుకున్నారు. కూతురు వామికా ఫొటోలు కూడా చాలా రోజుల తర్వాత బయటికి వచ్చాయి. కొడుకు అకాయ్‌ ముఖం ఎలా ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. అయితే.. పిల్లలతో ఉండటం & వారితో సమయం గడపడం ప్రపంచంలోనే అత్యంత విలువైన విషయం అని విరాట్‌ కోహ్లీ పేర్కొన్నాడు. ఐపీఎల్‌ 2024, టీ20 వరల్డ్‌ కప్‌ 2024 మధ్య దొరికిన కాస్త సమయాన్ని కుటుంబంతో గడిపి.. తాజాగా టీమిండియాతో చేరాడు కోహ్లీ. ఈ సందర్భంగానే కుటుంబం, పిల్లల గురించి ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశాడు. మరి కోహ్లీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.