కోహ్లీ, రోహిత్‌లతో జాగ్రత్త.. వాళ్లు సామాన్యులు కాదు! గంభీర్‌కు BCCI హెచ్చరిక

కోహ్లీ, రోహిత్‌లతో జాగ్రత్త.. వాళ్లు సామాన్యులు కాదు! గంభీర్‌కు BCCI హెచ్చరిక

Gautam Gambhir, Virat Kohli, Rohit Sharma, BCCI, IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్‌కి ముందు టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌కు బీసీసీఐ కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కోహ్లీ, రోహిత్‌ గురించి బీసీసీఐ గంభీర్‌కు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Gautam Gambhir, Virat Kohli, Rohit Sharma, BCCI, IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్‌కి ముందు టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌కు బీసీసీఐ కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కోహ్లీ, రోహిత్‌ గురించి బీసీసీఐ గంభీర్‌కు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రోజు(జులై 30, మంగళవారం) టీమిండియా, శ్రీలంకతో చివరి టీ20 మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌ను కూడా గెలిచి టీ20 సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయాలని భావిస్తోంది. టీ20 సిరీస్‌ తర్వాత.. లంకతో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది భారత జట్టు. ఆగస్టు 2 నుంచి వన్డే సిరీస్‌ మొదలుకానుంది. ఈ వన్డే సిరీస్‌ కోసం ఇప్పటికే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ శ్రీలంకకు చేరుకున్నాడు. ఈ రోజు విరాట్‌ కోహ్లీ కూడా రానున్నాడు. ఈ నేపథ్యంలోనే టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌కు బీసీసీఐ పెద్దలు పలు హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు టీ20 సిరీస్‌లో భాగంగా యువ క్రికెటర్లతో మాత్రమే ఉన్న గంభీర్‌.. వన్డే సిరీస్‌లో టీమిండియాలో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ లాంటి సూపర్‌ స్టార్‌ క్రికెటర్లతో కలిసి డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకోనున్నాడు. ఈ క్రమంలోనే యువ క్రికెటర్లతో వ్యవహరించినట్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలతో వ్యవహరించే ప్రయత్నం చేయవద్దని, సీనియర్‌ ఆటగాళ్లుగా వాళ్లతో ప్రోటాకల్‌ పాటించాల్సందే అంటూ బీసీసీఐ గంభీర్‌కు గట్టి సూచనలు చేసినట్లు రిపోర్ట్స్‌ పేర్కొంటున్నాయి. ఇది ఫ్రాంచైజ్‌ టీమ్‌ కాదని, ఇది ఇండియన్‌ టీమ్‌ అనే విషయం గుర్తుంచుకోవాలని గంభీర్‌ను హెచ్చరించినట్లు సమాచారం.

అంతా నీ ఇష్టం వచ్చినట్లు చేస్తానంటూ కుదరదని, కొత్తలో కొంత ఇబ్బంది ఉంటుందని, రాహుల్‌ ద్రవిడ్‌ కూడా ఈ విషయంలో కాస్త ఇబ్బంది పడ్డాడని, కానీ, తర్వాత అర్థం చేసుకున్నాడంటూ బీసీసీఐ పెద్దలు గంభీర్‌కు వివరించారు. ద్రవిడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయి.. కోచ్‌గా బాధ్యతలు తీసుకునే సమయానికి ఇండియన్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ వ్యవహరాల్లో చాలా మార్పులు జరిగాయి. వాటికి అనుగుణంగానే నడుచుకోవాలని గంభీర్‌కు సూచించారు. పైగా టీమ్‌లో చాలా మంది మల్టీ బిలియనీర్లు ఉన్నారు, ఫ్రాంచైజ్‌ క్రికెట్‌కు కెప్టెన్లుగా ఉన్నారు.. వారితో జాగ్రత్తగా వ్యవహరించాలని.. ఇష్టమొచ్చినట్లు చేస్తే కుదరదంటూ, ముఖ్యంగా విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ గంభీర్‌కు బీసీసీఐ పెద్దలు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments