ప్లేయర్ల నుంచి కోచ్​ వరకు అందరూ వ్యతిరేకం.. ఆ రూల్​ ఉంచుతారా? తీసేస్తారా?

BCCI: భారత క్రికెట్​లో ఇప్పుడో రూల్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆటగాళ్ల నుంచి కోచ్ వరకు అందరూ వద్దంటున్న ఈ నిబంధనను ఉంచుతారా? తీసేస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

BCCI: భారత క్రికెట్​లో ఇప్పుడో రూల్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆటగాళ్ల నుంచి కోచ్ వరకు అందరూ వద్దంటున్న ఈ నిబంధనను ఉంచుతారా? తీసేస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

టీమిండియా వరుస సిరీస్​లతో బిజీబిజీగా ఉంది. వరల్డ్ కప్ ముగిసిన వెంటనే జింబాబ్వే టూర్​కు వెళ్లిన భారత్.. ఇప్పుడు శ్రీలంక పర్యటనలో తలమునకలైంది. ఆ టీమ్​తో ఇప్పటికే రెండు టీ20లు ఆడిన మెన్ ఇన్ బ్లూ.. ఇంకో టీ20తో పాటు మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. ఒకవైపు టీమిండియా ఆడే మ్యాచ్​లను చూస్తున్న అభిమానులు.. మరోవైపు భారత క్రికెట్​లో జరుగుతున్న పలు ఇతర అంశాల గురించి కూడా చర్చించుకుంటున్నారు. ఐపీఎల్-2025కి ముందు మెగా ఆక్షన్ నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్లేయర్ల రిటెన్షన్, శాలరీ పర్స్ తదితర అంశాల గురించి ఐపీఎలో ఓనర్స్​తో ఈ నెల 31వ తేదీన జరిగే మీటింగ్​లో బీసీసీఐ డిస్కస్ చేయనుంది.

ప్లేయర్ల రిటెన్షన్, శాలరీ పర్స్​తో పాటు మరో అంశం గురించి కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలతో మీటింగ్​లో బోర్డు పెద్దలు చర్చించనున్నారు. అదే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్. ఆటగాళ్ల నుంచి కోచ్​ల వరకు అందరూ వద్దంటున్న ఈ నిబంధనను ఉంచుతారా? తీసేస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫ్రాంచైజీల సమావేశంలో దీనిపై బీసీసీఐ ఏదో ఒకటి తేల్చేస్తుందని అంటున్నారు. కొన్నేళ్ల కింద ప్రవేశపెట్టిన ఈ రూల్ వల్ల ఆల్​రౌండర్లకు అన్యాయం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రూల్​ను తీసేయాల్సిందేనని పలువురు ఆటగాళ్లు, కోచ్​లు బహిరంగంగా తమ అభిప్రాయాన్ని చెప్పడం తెలిసిందే.

ఇంత వ్యతిరేకత వస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ విషయంలో ఫ్రాంచైజీలు మాత్రం సానుకూలతతో ఉన్నాయని తెలుస్తోంది. ఈ నిబంధనను కొనసాగించాలని అవి పట్టుబడుతున్నాయని వినిపిస్తోంది. అయితే బీసీసీఐ మాత్రం ఈ రూల్​ను తీసేయాలని అనుకుంటోందట. దీని వల్ల ఆల్​రౌండర్లకు నష్టం జరుగుతోందని బోర్డు పెద్దలు భావిస్తున్నారట. ఐపీఎల్​తో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ అమల్లో ఉన్న ఈ రూల్ గురించి డొమెస్టిక్ క్రికెటర్స్, కోచ్​లు కూడా వ్యతిరేకత వ్యక్తం చేయడంతో బీసీసీఐ కంటిన్యూ చేయొద్దని అనుకుంటోందట. అయితే ఐపీఎల్ ఓనర్స్​ నుంచి వచ్చే అభిప్రాయాలు, రూల్ వల్ల కలిగే లాభనష్టాల గురించి మరోమారు కూలంకుషంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. మరి.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్​ను ఉంచాలా? తీసేయాలా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments