BCCI, GST: కేంద్ర ప్రభుత్వానికి రూ.2038 కోట్ల GST చెల్లించిన BCCI

BCCI, GST, Jay Shah: భారత క్రికెట్‌ బోర్డు.. తాజాగా రూ.2038.55 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఇంత మొత్తం ఎందుకు చెల్లించిందో వివరంగా తెలుసుకుందాం..

BCCI, GST, Jay Shah: భారత క్రికెట్‌ బోర్డు.. తాజాగా రూ.2038.55 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఇంత మొత్తం ఎందుకు చెల్లించిందో వివరంగా తెలుసుకుందాం..

ఈ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డు.. బీసీసీఐ(బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా). క్రికెట్‌ను మతంలా భావించే దేశంలో.. ఆటగాళ్లతో పాటు, క్రికెట్‌ బోర్డుపై కూడా భారీగా కాసుల వర్షం కురవడం ఖాయం. క్రికెట్‌కు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా.. బీసీసీఐ భారీ ఆదాయాన్ని గడిస్తోంది. అలాగే.. బంగారు బాతుగా పరిగణించే.. ఐపీఎల్‌(ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌)తో కూడా బీసీసీఐకి వేల కోట్ల ఆదాయం వచ్చి పడుతోంది. తమకు వచ్చే ఆదాయానికి తగ్గట్లే బీసీసీఐ సైతం.. క్రికెటర్లుకు జీతభత్యాలు, దేశంలో క్రికెట్‌ అభివృద్ధి, స్టేడియాల నిర్వహణ లాంటి వాటిని భారీగానే చేపడుతోంది. అయితే.. తాజాగా బీసీసీఐ ఏకంగా రూ.2038.55 కోట్లును కేంద్ర ప్రభుత్వానికి చెల్లించినట్లు రాజ్యసభలో కేంద్ర మంత్రి పంకజ్‌ చౌదరీ వెల్లడించారు.

గతంలో ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేని బీసీసీఐ.. ఇంత భారీ మొత్తంలో ప్రభుత్వానికి ఎందుకు చెల్లించిదంటూ క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఆదాయ పన్న చట్టం సెక్షన్‌ 11 కింద.. బీసీసీఐని ఒక చారిటబుల్‌ ట్రస్ట్‌గా పరిగణిస్తూ.. పన్ను మినహాయింపు ఇచ్చేవాళ్లు. కానీ, కొన్నేళ్లుగా ఆ మినహాయింపును రద్దు చేస్తూ.. బీసీసీఐని కూడా ఆదాయ పన్ను కిందికి తెచ్చారు. దీంతో.. 2022-23, 2023-24 ఏడాదులకు కలిపి.. మొత్తం రూ.2038.55 కోట్లను జీఎస్టీ రూపంలో బీసీసీఐ కేంద్ర ప్రభుత్వానికి చెల్లించినట్లు కేంద్ర మంత్రి రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలిపారు.

ఐపీఎల్‌ను ఒక కమర్షియల్‌ లీగ్‌గా నిర్వహిస్తూ.. వేల కోట్లలో ఆదాయం ఆర్జిస్తున్న బీసీసీఐకి పన్ను మినహాయింపు ఎందుకు ఇవ్వాలనే దానిపై కొంతమంది సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో.. బీసీసీఐ కూడా ఆదాయ పన్ను కట్టాల్సిందే అని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై బీసీసీఐ ఇంకా న్యాయపోరాటం చేస్తున్నప్పటికీ.. కోర్టు ఆదేశాలతో గత కొన్నేళ్లుగా పన్ను చెల్లిస్తోంది. బీసీసీఐ.. తమిళనాడు సోసైటీల రిజిస్ట్రేషన్‌ చట్టం 1975కి లోబడి రిజిస్టర్‌ అయిన సంస్థ. అయితే.. కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీసీఐకి ఎలాంటి గ్రాంట్లు, నిధులు, పథకాలు ఇవ్వడం లేదని కూడా కేంద్ర మంతి వెల్లడించాడు. మరి బీసీసీఐ ఇంత భారీ మొత్తంలో పన్ను చెల్లించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments