iDreamPost

BCCI: టీమిండియా హెడ్ కోచ్ గా ఆ దిగ్గజం? సరైనోడినే ఎంచుకుంటున్న BCCI!

టీమిండియా కోత్త కోచ్ గా ఆ దిగ్గజ ప్లేయర్ పేరును బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి బీసీసీఐ పెద్దల లిస్ట్ లో ఉన్న ఆ దిగ్గజం ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

టీమిండియా కోత్త కోచ్ గా ఆ దిగ్గజ ప్లేయర్ పేరును బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి బీసీసీఐ పెద్దల లిస్ట్ లో ఉన్న ఆ దిగ్గజం ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

BCCI: టీమిండియా హెడ్ కోచ్ గా ఆ దిగ్గజం? సరైనోడినే ఎంచుకుంటున్న BCCI!

టీమిండియా హెడ్ కోచ్ ఎవరు? ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం. ప్రస్తుతం భారత హెడ్ కోచ్ గా కొనసాగుతున్న రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 వరల్డ్ కప్ తర్వాత ముగుస్తుండటంతో.. బీసీసీఐ కోత్త కోచ్ ను వెతికే పనిలో పడింది. ఇందుకోసం ఇప్పటికే ప్రకటన కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా కోత్త కోచ్ గా ఆ దిగ్గజ ప్లేయర్ పేరును బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి బీసీసీఐ పెద్దల లిస్ట్ లో ఉన్న ఆ దిగ్గజం ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

టీమిండియా కొత్త కోచ్ కోసం వేట మెుదలుపెట్టింది బీసీసీఐ. ఇందు కోసం ప్రకటన కూడా విడుదల చేసింది. మే 27న దరఖాస్తు చేసుకోవడానికి చివరి రోజుగా పేర్కొంది. అయితే భారత జట్టు హెడ్ కోచ్ గా న్యూజిలాండ్ దిగ్గజ ప్లేయర్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. రాహుల్ ద్రవిడ్ వారసుడిగా ఫ్లెమింగ్ సరైనోడని బీసీసీఐ భావిస్తోందట. అందుకే అతడిని హెడ్ కోచ్ గా తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అదీకాక ఇప్పటికే ఫ్లెమింగ్ తో బీసీసీఐ పెద్దలు చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ప్రస్తుతం స్టీఫెన్ ఫ్లెమింగ్ చెన్నై సూపర్ కింగ్స్ కు కోచ్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇతడి కోచింగ్ లో చెన్నై ప్లేయర్లు ఎలా రాటుదేలుతున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పైగా అతడికి కోచ్ గా అపార అనుభవం ఉంది. చెన్నైని ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిపిన ఘనత ఫ్లెమింగ్ సొంతం. అయితే బీసీసీఐ కండిషన్స్ ను అతడు ఒప్పుకుంటాడా? అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.  మూడు ఫార్మాట్స్ లో టీమిండియాను ముందుకు నడిపించాలి, దాదాపు సంవత్సరానికి 10 నెలలు జట్టుతో పాటే ఉండాలి. ఒకవేళ ఈ కివీస్ దిగ్గజం టీమిండియాకు కోచ్ గా వస్తే.. చెన్నైతో ఉన్న తన బంధాన్ని తెంచుకోవాల్సి వస్తుంది. ఇక ఫ్లెమింగ్ తో పాటుగా జస్టిన్ లాంగర్ కూడా కోచ్ పదవి రేసులో ఉన్నట్లు సమాచారం. మరి టీమిండియా కొత్త కోచ్ ఎవరైతే బాగుంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by RVCJ Media (@rvcjinsta)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి