BCCI కీలక నిర్ణయం.. ఇకపై ప్లేయర్లకు పండగే!

BCCI Introduces Prize Money In Domestic Cricket: క్రికెట్ అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకొని అమలుపరుస్తూ దూసుకెళ్తోంది బీసీసీఐ. అలాంటి బోర్డు ఆటగాళ్ల కోసం మరో డెసిషన్ తీసుకుంది. ఇక మీదట ప్లేయర్లకు పండగేనని చెప్పాలి.

BCCI Introduces Prize Money In Domestic Cricket: క్రికెట్ అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకొని అమలుపరుస్తూ దూసుకెళ్తోంది బీసీసీఐ. అలాంటి బోర్డు ఆటగాళ్ల కోసం మరో డెసిషన్ తీసుకుంది. ఇక మీదట ప్లేయర్లకు పండగేనని చెప్పాలి.

క్రికెట్ అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకొని అమలుపరుస్తూ దూసుకెళ్తోంది బీసీసీఐ. ఆడియెన్స్​కు మంచి వ్యూయింగ్ ఎక్స్​పీరియెన్స్ ఇవ్వాలని అనేక చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో ఆటగాళ్ల బాగు కోసం చేయాల్సింది చేస్తోంది. ఇంటర్నేషనల్ ప్లేయర్ల గురించే గాక డొమెస్టిక్ లెవల్, జూనియర్ కాంపిటీషన్స్​లో ఆడేవారి గురించి కూడా ఆలోచనలు చేస్తోంది. విమెన్స్ క్రికెట్​ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కూడా ప్లాన్స్ చేస్తోంది. అందులో భాగంగానే బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. డొమెస్టిక్ క్రికెట్​లో ఆటగాళ్ల పెర్ఫార్మెన్స్​కు మరింత ప్రోత్సాహం అందించేందుకు ఓ డెసిషన్ తీసుకుంది. ఇక మీదట విజయ్ హజారే వన్డే టోర్నీ, ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీల్లో ‘ప్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్’గా నిలిచే వారికి ప్రైజ్​మనీ ఇవ్వనున్నారు.

విజయ్ హజారే వన్డే టోర్నీ, ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీల్లో ‘ప్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్’గా నిలిచే ఆటగాళ్లకు ప్రైజ్​మనీ ఇవ్వనున్నట్లు బీసీసీఐ సెక్రెటరీ జైషా అనౌన్స్ చేశారు. ఇప్పటిదాకా ఈ రెండు టోర్నీల్లో నాకౌట్ మ్యాచెస్​లో మాత్రమే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​’ను ప్రకటించి క్రికెటర్లకు బహూకరించేవారు. వీళ్లకు మెమొంటో మాత్రమే ఇచ్చేవారు. ప్రైజ్​మనీ ఇవ్వలేదు. లీగ్ మ్యాచెస్​లో ఈ అవార్డు ఇచ్చే కల్చర్ లేదు. కానీ దీనిపై బోర్డు నిర్ణయంతో మార్పు రానుంది. బీసీసీఐ డెసిషన్​తో మహిళల క్రికెట్, జూనియర్ క్రికెట్​ టోర్నమెంట్స్​లోనూ ఛేంజ్ రానుంది. విమెన్స్ క్రికెట్, జూనియర్ క్రికెట్ కాంపిటీషన్స్​లకూ తాజా ప్రైజ్​మనీ నిర్ణయం వర్తిస్తుందని జైషా స్పష్టం చేశారు.

డొమెస్టిక్ క్రికెట్​లో టాప్ పెర్ఫార్మెన్స్ కనబర్చే ఆటగాళ్లకు తగిన గుర్తింపు ఇవ్వాలనే వాతావరణాన్ని తాము నెలకొల్పుతున్నామని జైషా తెలిపారు. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఈ డెసిషన్ తీసుకుందని పేర్కొన్నారు. అందుకు కౌన్సిల్ సభ్యులకు షా ధన్యవాదాలు చెప్పారు. కాగా, ఇప్పటివరకు డొమెస్టిక్ క్రికెట్​లో రంజీ ట్రోఫీలో మాత్రమే బీసీసీఐ క్యాష్ రివార్డ్స్ ఇచ్చేది. తాజా నిర్ణయంతో డొమెస్టిక్ క్రికెట్​తో పాటు విమెన్స్ క్రికెట్, జూనియర్ క్రికెట్ కాంపిటీషన్స్​లోనూ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆటగాళ్లకు నగదు ప్రోత్సాహకం అందనుంది.

బోర్డు నిర్ణయంతో ప్లేయర్లకు పండుగేనని చెప్పాలి. ఇన్నాళ్లూ తమకు సరైన గుర్తింపు, ప్రోత్సాహకం దక్కడం లేదని బాధపడుతున్న వారికి ఇది సూపర్ న్యూస్. ఈ డెసిషన్​పై సోషల్ మీడియాలో నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. బోర్డు నిర్ణయం భేష్ అంటూ మెచ్చుకుంటున్నారు. డొమెస్టిక్ క్రికెట్ బలోపేతం కోసం ఇది హెల్ప్ అవుతుందని, ప్లేయర్లు వాళ్ల బెస్ట్ ఇచ్చేలా ఎంకరేజింగ్​గా ఉంటుందని చెబుతున్నారు. మరి.. డొమెస్టిక్ క్రికెట్ కోసం బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments