ఆసియా కప్‌ 2023లో ఆడే టీమిండియా ఇదే! జట్టును ప్రకటించిన BCCI

వన్డే వరల్డ్‌ కప్‌కు ముందు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆసియా కప్‌ 2023 కోసం భారత సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ప్రకటించిన ఈ జట్టు ఎంతో దుర్బేధ్యంగా ఉంది. కాగా.. ఈ నెల 30 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు జరగనున్న ఆసియా కప్‌ 2023 ఈ సారి పాత పద్ధతిలోనే వన్డే ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. గతేడాది ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. దానికి కారణం ఏంటంటే.. ఆసియా కప్‌ 2022 తర్వాత వెంటనే టీ20 వరల్డ్‌ కప్‌ ఉండటంతో.. షార్ట్‌ ఫార్మాట్‌కు ఆటగాళ్లు అలవాటు పడతారని ఆసియా కప్‌ను కూడా టీ20 ఫార్మాట్‌లో నిర్వహించారు. ఇప్పుడు వన్డే వరల్డ్‌ కప్‌ 2023కు ముందు ఈ ఆసియా కప్‌ జరుగుతుండటంతో దీన్ని వన్డే ఫార్మాట్‌లో నిర్వహిస్తున్నారు.

ఇకపోతే.. ఆసియా కప్‌ కోసం ఎంపిక చేసిన భారత జట్టు ఎంతో సమతుల్యంతో కనిపిస్తోంది. పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌తో పాటు ఆల్‌రౌండర్లు, డేంజరస్‌ బౌలింగ్‌ ఎటాక్‌తో టీమిండియా శత్రుదుర్బేధ్యంగా ఉంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, బుమ్రా, సిరాజ్‌ టీమిండియాకు ప్రధాన బలంగా కానున్నారు. అలాగే గాయాల నుంచి తిరిగొచ్చిన ఆటగాళ్ల కూడా ఈ టోర్నీ ఎంతో కీలకంగా మారనుంది. వరల్డ్‌ కప్‌లో ఆడాలంటే.. ఆసియా కప్‌లో తప్పక రాణించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే.. ఈ ఆసియా కప్‌ కోసం తెలుగు తేజం తిలక్‌ వర్మను ఎంపిక చేయడంపై క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి కింద ఉన్న టీమ్‌ను చూసి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఆసియా కప్‌ కోసం ప్రకటించిన జట్టు ఇదే..
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌, హర్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దుల్‌ ఠాకూర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, షమీ, సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, సంజు శాంసన్‌(బ్యాక్‌ అప్‌)

Show comments