వీడియో: కరేబియన్‌ లీగ్‌లో బార్బడోస్‌ రాయల్స్‌ బౌలర్‌ వెరైటీ సెలబ్రేషన్స్‌!

Barbados Royals, Aaliyah Alleyne, WCPL 2024: సోషల్‌ మీడియాలోను ఊపేసే ఓ వెరైటీ సెలబ్రేషన్స్‌ వీడియో కరేబియన్‌ లీగ్‌లో చోటు చేసుకుంది. అదేంటో.. ఎందుకు చేశారో ఇప్పుడు చూద్దాం..

Barbados Royals, Aaliyah Alleyne, WCPL 2024: సోషల్‌ మీడియాలోను ఊపేసే ఓ వెరైటీ సెలబ్రేషన్స్‌ వీడియో కరేబియన్‌ లీగ్‌లో చోటు చేసుకుంది. అదేంటో.. ఎందుకు చేశారో ఇప్పుడు చూద్దాం..

క్రికెట్‌లో వికెట్‌ పడిన సమయంలో బౌలర్లు, ఆటగాళ్లు సెలబ్రేట్‌ చేసుకోవడం కామన్‌, కానీ కొన్ని సార్లు ఆ సెలబ్రేషన్స్‌.. భలే ఫన్నీగా ఉంటాయి. తాజాగా ఉమెన్స్‌ కరేబియన్‌ లీగ్‌ 2024లో క్రికెటర్లు చేసిన వెరైటీ సెలబ్రేషన్స్‌.. ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా మారిపోయింది. గురువారం బార్బడోస్ రాయల్స్, ట్రిబాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ ఎంతో థ్రిల్లింగ్‌గా సాగింది. ఈ మ్యాచ్‌లో బార్బడోస్‌ రాయల్స్‌ రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది.

అయితే మ్యాచ్‌లో రాయల్స్‌ ప్లేయర్లు చేసుకున్న సెలబ్రేషన్స్‌ వీడియో సోషల్‌ మీడియాను ఊపేస్తోంది. రాయల్స్‌ బౌలర్‌ ఆలియా అలీనే.. నైట్‌ రైడర్స్‌ బ్యాటర్‌ జానిల్లియా గ్లాస్గోను ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌ తొలి బంతికి అవుట్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో ఆలియా అలీనేకి అదే తొలి ఓవర్‌.. ఫస్ట్‌ ఓవర్‌ ఫస్ట్‌ బాల్‌కే వికెట్‌ తీయడంతో.. ఆ ఆనందానికి అవధులు లేవు. టీమ్‌లోని మరో ఇద్దరు ప్లేయర్లతో కలిసి.. ఆలియా అలీనే నేలపై స్కై డైవింగ్‌ చేస్తూ.. వెరైటీ సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. ఫస్ట్‌ బాల్‌కే వికెట్‌ తీయడంతో ఆమె ఇలా సెలబ్రేషన్స్‌ చేసుకున్నారు. మరో విశేషం ఏంటంటే.. ఈ సెలబ్రేషన్స్‌కు గాను.. ఆమెకు బెస్ట్‌ సెలబ్రేషన్స్‌ అవార్డు కూడా లభించింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ట్రిబాగో నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 93 పరుగులు మాత్రమే చేసింది. జానిల్లియా గ్లాస్గో 24, షిఖా పాండే 28 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలం అయ్యారు. రాయల్స్‌ బౌలర్లలో ఆలియా అలీనే ఏకంగా 4 వికెట్లతో చెలరేగింది. హేలీ మ్యాథ్యూస్‌ 2 వికెట్లు పడగొట్టింది. ఇక 94 పరుగుల టార్గెట్‌లో బరిలోకి దిగిన బార్బడోస్‌ రాయల్స్‌ 15 ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదిపారేసింది. ఛమరి ఆటపట్టు 39 పరుగులతో మ్యాచ్‌ విన్నింగ్‌ నాక్‌ ఆడింది. మరి ఈ మ్యాచ్‌లో ఆలియా అలీనే వెరైటీ సెలబ్రేషన్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments