పాక్‌పై అదరగొట్టినా.. షకీబ్‌ అల్‌ హసన్‌పై బ్యాన్‌? కారణం ఏంటంటే?

Shakib Al Hasan Ban, Bangladesh Cricket Board: బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌పై నిషేధం విధించే సూచనలు కనిపిస్తున్నాయి. పాక్‌పై మంచి ప్రదర్శన చేసినా.. అతనిపై ఎందుకు నిషేధం పడుతుందో ఇప్పుడు చూద్దాం..

Shakib Al Hasan Ban, Bangladesh Cricket Board: బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌పై నిషేధం విధించే సూచనలు కనిపిస్తున్నాయి. పాక్‌పై మంచి ప్రదర్శన చేసినా.. అతనిపై ఎందుకు నిషేధం పడుతుందో ఇప్పుడు చూద్దాం..

పాకిస్థాన్‌ను వాళ్ల దేశంలోనే ఓడించి.. బంగ్లాదేశ్‌ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో బంగ్లా క్రికెటర్లు ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు.. కానీ, ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌కు మాత్రం ఇబ్బందులు ఎదురయ్యేలా కనిపిస్తున్నాయి. అతనిపై నిషేధం విధించే సూచనలు కనిపిస్తున్నాయంటూ బంగ్లా మీడియా పేర్కొంటోంది. అదేంటి.. పాకిస్థాన్‌తో రావాల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో బ్యాటింగ్‌లో రాణించకపోయినా.. బౌలింగ్‌లో అదరగొడుతూ.. పాక్‌ను రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 146 పరుగులకే ఆలౌట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించిన షకీబ్‌పై ఎందుకు నిషేధం విధిస్తారనే డౌట్‌ రావొచ్చు.

అయితే.. అందుకు కారణం వేరే ఉంది. కొన్ని రోజుల క్రితం బంగ్లాదేశ్‌లో తీవ్ర అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు.. తీవ్రరూపం దాల్చడంతో.. భారీ అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు ఏకంగా ప్రధానమంత్రి నివాసంలోకి దూసుకెళ్లారు. ఆ ఘటనతో ప్రధాని పదవికి రాజీనామా చేసి.. షేక్‌ హసీనా ఇండియాకు వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ అల్లర్లలో తన కొడుకు మృతి చెందాడని, అందుకు కారణం వీళ్లే అంటూ ఓ వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. అందులో మాజీ ప్రధాని షేక్‌ హసీనాతో పాటు మరికొంతమందిని నిందితులుగా చేర్చాడు. ఆ లిస్ట్‌లో షకీబ్‌ అల్‌ హసన్‌ పేరు కూడా ఉంది.

షేక్‌ హసీనా ప్రభుత్వంలో షకీబ్‌ సైతం ఎంపీగా ఉన్నాడు. అవామీ లీగ్‌ పార్టీలో చేరి ఎంపీ అయ్యాడు షకీబ్‌. అలా ప్రభుత్వంలో భాగమైన షకీబ్‌ కూడా తన కుమారుడు మృతికి కారణం అయ్యాడని బాధితుడు పేర్కొనడంతో.. ఒక వేళ ఆ కేసులో నిందితుడిగా ఉన్న షకీబ్‌పై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేస్తే. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు షకీబ్‌పై నిషేధం విధించే అవకాశం. ఇప్పటికైతే.. షకీబ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేం అని, కేవలం ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయినంత మాత్రాన టీమ్‌ నుంచి తీసేయలేంటూ బీసీబీ అధికారులు వెల్లడించారు. ఒక వేళ న్యాయస్థానం నుంచి తమకు ఆదేశాలు వస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని బంగ్లా క్రికెట్‌ బోర్డు అధికారులు వెల్లడించాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments