SNP
Jaker Ali, BAN vs SA, T20 World Cup 2024: వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో మ్యాచ్ ఆడుతూ.. మ్యాచ్ మధ్యలో ఓ బ్యాటర్ తన బ్యాట్‌ను రెండు ముక్కలుగా విరగ్గొట్టాడు. అలా ఎందుకు చేశాడో ఇప్పుడు చూద్దాం..
Jaker Ali, BAN vs SA, T20 World Cup 2024: వరల్డ్ కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో మ్యాచ్ ఆడుతూ.. మ్యాచ్ మధ్యలో ఓ బ్యాటర్ తన బ్యాట్‌ను రెండు ముక్కలుగా విరగ్గొట్టాడు. అలా ఎందుకు చేశాడో ఇప్పుడు చూద్దాం..
SNP
క్రికెట్‌లో ఆటగాళ్ల మధ్య గొడవలు, అంపైర్లతో వాదనలు కామన్. అలా ఉంటేనే మజా ఉంటుందని కొంతమంది క్రికెట్ అభిమానులు అంటుంటారు. మరికొంత మంది క్రికెట్ జెంటిల్‌మెన్ గేమ్.. ఇక్కడ గొడవలకు, అతి ఆవేశాలకు తావు లేదని చెబుతుంటారు. ఎవరు ఎన్ని చెప్పినా.. క్రికెట్‌లో ఆటగాళ్ల నుంచి రకరకాల ఎమోషన్స్ మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ బంగ్లాదేశ్ బ్యాటర్ కాస్త ఓవర్ యాక్షన్ చేస్తూ.. గ్రౌండ్‌లోనే బ్యాట్‌ను రెండుగా విరగ్గొట్టాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లోనే బంగ్లా బ్యాటర్ జాకెర్ అలీ బ్యాట్‌ను విరగ్గొట్టాడు. అతను అలా ఎందుకు చేశాడో ఇప్పుడు చూద్దాం..
ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయానికి 7 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన సమయంలో జాకెర్ తన బ్యాట్‌ను విరగ్గొట్టాడు. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఓట్నీల్ బార్ట్‌మన్ బౌలింగ్‌లో ఫుల్ షాట్ క్రమంలో అలీ బ్యాటర్ కాస్త డ్యామేజ్ అయింది. అతను ఆడాలనుకున్న షాట్ మిస్ టైమ్ కావడంతో కోపంతో ఊగిపోయిన జాకెర్ అలీ.. అప్పటి కాస్త డ్యామేజ్ అయిన తన బ్యాట్‌ను రెండుగా విరగ్గొట్టాడు. బ్యాట్ హ్యాండిల్‌ను మొకాలికేసి వంచడంతో బ్యాట్ రెండు ముక్కలైంది. బ్యాట్ విరగొట్టి గ్రౌండ్‌లో పడేసి.. తనకు కొత్త బ్యాట్ కావాలని డ్రెస్సింగ్ రూమ్ వైపు సైగ చేశాడు. ఆ తర్వాత అతని కొత్త బ్యాట్ తెచ్చి ఇచ్చారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా నిర్దేశించిన 114 పరుగుల స్వల్ప టార్గెట్‌ను ఛేదించలేకపోయింది బంగ్లాదేశ్. నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరి ఓవర్‌లో వారి విజయానికి 11 రన్స్ అవసరమవగా.. కేవలం 6 పరుగులు మాత్రమే చేసింది. సౌతాఫ్రికా బౌలర్ కేశవ్ మహారాజ్ చివరి ఓవర్‌ను అద్భుతంగా వేయడంతో బంగ్లాకు ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేసింది. క్లాసెన్ 46, మిల్లర్ 29 రన్స్ చేసి రాణించారు. మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. బంగ్లా బౌలర్లలో తంజిమ్ సకీబ్ 3, టస్కిన్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు. బంగ్లా బ్యాటర్లలో తౌహిద్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచినా.. జట్టును గెలిపించలేపోయాడు. మరి ఈ మ్యాచ్‌లో బంగ్లా బ్యాటర్ అలీ చేసిన అతిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.