వీడియో: మ్యాచ్‌ మధ్యలో ఓవర్‌ యాక్షన్‌ చేసిన బంగ్లా బౌలర్‌! గట్టిగా బుద్ధి చెప్పిన ICC

వీడియో: మ్యాచ్‌ మధ్యలో ఓవర్‌ యాక్షన్‌ చేసిన బంగ్లా బౌలర్‌! గట్టిగా బుద్ధి చెప్పిన ICC

Tanzim Hasan Sakib, BAN vs NEP, T20 World Cup 2024: మ్యాచ్‌ ఆడుతూ.. దురుసుగా ప్రవర్తించిన ఓ బంగ్లా ప్లేయర్‌కు ఐసీసీ ఊహించని షాకిచ్చింది. మరి ఆ ప్లేయర్‌ ఎవరో ? ఐసీసీ ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం..

Tanzim Hasan Sakib, BAN vs NEP, T20 World Cup 2024: మ్యాచ్‌ ఆడుతూ.. దురుసుగా ప్రవర్తించిన ఓ బంగ్లా ప్లేయర్‌కు ఐసీసీ ఊహించని షాకిచ్చింది. మరి ఆ ప్లేయర్‌ ఎవరో ? ఐసీసీ ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ రోజు(జూన్‌ 19) నుంచి సూపర్‌ 8 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. అయితే.. గ్రూప్‌ స్టేజ్‌ మ్యాచ్‌ల సందర్భంగా ఓ బంగ్లాదేశ్‌ బౌలర్‌ చాలా ఓవర్‌ యాక్షన్‌ చేశాడు. బ్యాటర్‌పైకి గొడవకు దూసుకెళ్లాడు. దీంతో.. ఐసీసీ ఆ బౌలర్‌కు గట్టి షాక్‌ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ అతనికి మ్యాచ్‌ ఫీజులో ఏకంగా 15 శాతం కోత విధించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా కింగ్స్‌టౌన్‌ వేదికగా సోమవారం బంగ్లాదేశ్‌, నేపాల్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ పేసర్‌ తంజీమ్‌ హసన్‌ సకీబ్‌.. నేపాల్‌కెప్టెన్‌ రోహఙత్‌ పౌడేల్‌తో కాస్త దురుసుగా ప్రవర్తించాడు.

నేపాల్‌ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో తంజీమ్‌ వేసిన బాల్‌ను రోహిత్‌ పౌడేల్‌ డిఫెన్స్‌ షాట్లు ఆడుతుండటంతో తంజీమ్‌ సహనం కోల్పోయి.. అతన్ని ఏదో అన్నాడు. దానికి రోహిత్‌ పౌడేల్‌ కూడా ఏదో అనడంతో.. వాట్‌ హ్యాపెండ్‌.. వాట్‌ హ్యాపెండ్‌ అంటూ అతనికి మీదకి దూసుకెళ్లాడు తంజీమ్‌. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రౌండ్‌లో వాతావరణం వేడెక్కింది. మ్యాచ్‌ తర్వాత ఈ ఘటనపై విచారణ జరిగిన ఐసీసీ తంజీమ్‌కు మ్యాచ్‌ ఫీజులో 15 శాతం జరిమాన విధించింది. ఐసీసీ నిబంధనలలోని ఆర్టికల్‌ 2.12 ప్రకారం.. అంతర్జాతీయ మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు.. ఆటగాళ్లు, అంపైర్లు, మ్యాచ్‌ రిఫరీ, ప్రేక్షకులు ఇలా ఎవరితోనైనా దురుసగా, అనుచితంగా ప్రవర్తిస్తే దాన్ని నేరంగా పరిగణిస్తారు.

ఈ విషయంలో ఆన్‌ ఫీల్డ్‌ అంపైర్లు అషన్‌ రాజా, సామ్‌ నొగాస్కి.. థర్డ్‌ అంపైర్‌ జయరామన్‌ మదనగోపాల్‌, ఫోర్త్‌ అంపైర్‌ కుమార ధర్మసేన కూడా తప్పు తంజీమ్‌దేనని నివేదిక ఇవ్వడంతో ఐసీసీ తంజీమ్‌పై చర్యలు తీసుకుంది. ప్రవర్తన సంగతి ఎలా ఉన్నా.. ప్రదర్శనతో మాత్రం ఆకట్టుకున్నాడు తంజీమ్‌ హసన్‌. ఈ మ్యాచ్‌లో పూర్తి 4 ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇంత మంచి ప్రదర్శన చేసినా కూడా అతని బ్యాడ్‌ బిహేవియర్‌తో అది కనిపించకుండా పోయింది. ఆటతో పాటు కాస్త వినయం కూడా ఉండాలని క్రికెట్‌ అభిమానులు పేర్కొంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments