iDreamPost
android-app
ios-app

‘బేబీ ఈజ్ ఆన్ ది వే’.. ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన ధోని భార్య! పోస్ట్ వైరల్

  • Published Apr 29, 2024 | 3:37 PM Updated Updated Apr 29, 2024 | 3:37 PM

బేబీ ఈజ్ ఆన్ ది వే అంటూ ధోని భార్య సాక్షి సింగ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాక్షి ఎందుకు ఆ పోస్ట్ చేసింది? పూర్తి వివరాల్లోకి వెళితే..

బేబీ ఈజ్ ఆన్ ది వే అంటూ ధోని భార్య సాక్షి సింగ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాక్షి ఎందుకు ఆ పోస్ట్ చేసింది? పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Apr 29, 2024 | 3:37 PMUpdated Apr 29, 2024 | 3:37 PM
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’.. ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన ధోని భార్య! పోస్ట్ వైరల్

ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో వరుస ఓటములకు బ్రేక్ ఇస్తూ.. గొప్పగా పుంజుకుని విజయం సాధించింది. దీంతో ఆరో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకి, ప్లే ఆఫ్ ఆశలను మెరుగుపర్చుకుంది. ఇక ఈ మ్యాచ్ చూస్తూ ధోని భార్య చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ‘బేబీ ఈజ్ ఆన్ ది వే’ అంటూ తన ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టింది. అసలు విషయం ఏంటంటే?

సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై 78 పరుగుల తేడా తో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రుతురాజ్ 98 రన్స్ చేసి కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అతడికి తోడు డార్లీ మిచెల్(52) పరుగులతో రాణించాడు. ఇక 213 రన్స్ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ కేవలం 134 రన్స్ కే కుప్పకూలింది.  చెన్నై బౌలర్ తుషార్ దేశ్ పాండే 4 వికెట్లతో రాణించాడు.

ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ జరుగుతుండగానే మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని భార్య సాక్షి సింగ్ ఓ పోస్ట్ చేసింది. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే? “ప్లీజ్ ఇవ్వాళ మ్యాచ్ ను త్వరగా ముగించడం.. బేబీ ఈజ్ ఆన్ ది వే, కాబోయే అత్తగా ఇదే నా అభ్యర్థన”  అంటూ ధోని కీపింగ్ చేస్తున్న ఫొటోను తన ఇన్ స్టా స్టోరీలో పంచుకుంది.  ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ కావడంతో.. మామ కాబోతున్న ధోనికి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సోషల్ మీడియాకు ధోని దూరంగా ఉంటాడు. కానీ అతడి భార్య సాక్షి మాత్రం ఫుట్ యాక్టీవ్ గా ఉంటూ అభిమానులతో తన సంతోషాన్ని పంచుకుంటూ ఉంటుంది.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique