iDreamPost
android-app
ios-app

VIDEO: నువ్వు క్రికెటర్‌వి కాదు.. పెయింటర్‌వి! బాబర్‌ అజమ్‌ పరువుతీశాడుగా..

  • Author Soma Sekhar Published - 03:54 PM, Tue - 29 August 23
  • Author Soma Sekhar Published - 03:54 PM, Tue - 29 August 23
VIDEO: నువ్వు క్రికెటర్‌వి కాదు.. పెయింటర్‌వి! బాబర్‌ అజమ్‌ పరువుతీశాడుగా..

బాబర్ అజమ్.. ఎప్పుడూ ఎదో ఒక వార్తతో నెట్టింట్లో వైరల్ గా మారుతూ ఉంటాడు. ఒక్కోసారి ట్రోల్స్ కు గురైతే.. ఇంకోసారి విమర్శలపాలవుతూ ఉంటాడు. తాజాగా మరోసారి బాబర్ వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి అతడి పరువు తీసింది ఏ నెటిజనో.. అభిమానో కాదు. స్వయాన అతడి సోదరుడే. అవును బాబర్ ఇటీవల లంక ప్రీమియర్ లీగ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ లీగ్ లో ఆడుతున్నప్పుడు అక్కడ ఓ పెయింటింగ్ వేశాడు బాబర్. ఆ పెయింటింగ్ ను చూసిన అతడి తమ్ముడు బాబర్ పరువును తీసేశాడు. కారులో వెళ్తు అతడి పెయింటింగ్ పై చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

పాకిస్థాన్ టీమ్ కెప్టెన్ బాబర్ అజమ్ పరువు తీశాడు అతడి తమ్ముడు. లంక ప్రీమియర్ లీగ్ లో పాల్గొన్న సందర్భంలో అక్కడ ఒక పెయింటింగ్ వేశాడు బాబర్. లంకన్ పెయింటింగ్ లీగ్ అనే కార్యక్రమంలో పాల్గొని.. యాంకర్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. తనలోని పెయింటర్ ను బయటి ప్రపంచానికి చూపించాడు. మీకు నచ్చిన కలర్ ఏంటి? అని అడిగితే.. బ్లాక్ అని, మీరు స్కూల్లో బెస్ట్ పెయింటరా? అంటే కాదు అని ఆన్సర్స్ ఇచ్చాడు. నాకు పెయింటింగ్ బ్రష్ కంటే బ్యాటే ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు బాబర్. ఈ సమాధానాలు చెబుతూనే.. తనకు వచ్చిన పెయింటింగ్ ను డ్రాయింగ్ బోర్డ్ మీద వేశాడు. అది మౌన్ టైన్ పెయింటింగ్ అని చెప్పుకొచ్చాడు.

ఇక ఈ పెయింటింగ్ ను చూసిన బాబర్ తమ్ముడు అతడి పరువు మెుత్తం తీశాడు. అన్నదమ్ములిద్దరు కారులో కలిసి వెళ్తున్న క్రమంలో బాబర్ పెయింటింగ్ స్కిల్స్ గురించి నవ్వుతూ చెప్పుకొచ్చాడు. అసలు ఆ పెయింటింగ్ ఏంటి? నువ్వు క్రికెటర్ వి కాదు పెయింటర్ వి, ఆ పెయింటింగ్ నీకు ఎలా గీయాలనిపించింది? అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఈ వీడియోను ఫరీద్ ఖాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది కాస్త నెట్టింట వైరల్ గా మారింది. బాబర్ నీలో బ్యాటరే కాదు.. పెయింటర్ కూడా ఉన్నాడా? అంటూ కొందరు కామెంట్ చేస్తే.. మరికొందరేమో దాన్ని డ్రాయింగ్ అంటారా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరి బాబర్ గీసిన పెయింటింగ్ పై, అతడు తమ్ముడు చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.


ఇదికూడా చదవండి: వాళ్ల ముగ్గురితో మాట్లాడుతున్నా.. వన్డేల్లో కూడా ఇరగదీస్తా: SKY

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş