వీడియో: ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సులు బాదిన బాబర్‌! అయినా తప్పని ట్రోల్స్‌

Babar Azam, Pakistan vs Ireland: పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ ఒకే ఓవర్‌లో ఏకంగా నాలుగు సిక్సులు బాదాడు.. అయినా కూడా క్రికెట్‌ అభిమానులు అతన్ని ఏకి పారేస్తున్నారు. దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Babar Azam, Pakistan vs Ireland: పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ ఒకే ఓవర్‌లో ఏకంగా నాలుగు సిక్సులు బాదాడు.. అయినా కూడా క్రికెట్‌ అభిమానులు అతన్ని ఏకి పారేస్తున్నారు. దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024కి ముందు పాకిస్థాన్‌ జట్టు ఐర్లాండ్‌పై సత్తా చాటింది. మూడు టీ20ల సిరీస్‌ కోసం ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లిన బాబర్‌ సేన.. 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన చివరి టెస్టులో పాకిస్థాన్‌ విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ ఒకే ఓవర్‌లో ఏకంగా నాలుగు సిక్సులు బాది.. పసికూనపై తన ప్రతాపం చూపించాడు. ఐర్లాండ్‌ బౌలర్‌ బెంజిమెన్‌ వైట్‌ వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో బాబర్‌ నాలుగు సిక్సులు బాది ఒక సింగిల్‌తో మొత్తం 25 పరుగులు పిండుకున్నాడు.

ఆ ఓవర్‌లో తొలి మూడు బంతుల్లో మూడు సిక్సులు బాదిన బాబర్‌.. నాలుగో బంతిని డాట్‌ చేశాడు. అలాగే ఐదో బంతికి మరో సిక్స్‌ బాదాడు. చివరి బంతికి సింగిల్‌ తీశాడు. ఇలా తన కెరీర్‌లో మొదటి సారి ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సులు కొట్టాడు బాబర్‌ అజమ్‌. ఇలా ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సులు బాదినా.. అతనిపై ట్రోల్స్‌ మాత్రం ఆగడం లేదు. ఐర్లాండ్‌, జింబాబ్వే జట్లపై మాత్రమే బాబర్‌ ఇలాంటి అద్భుతాలు చేస్తాడని.. అందుకే అతన్ని అంతా జింబాబర్‌ అంటారని ఎద్దేవా చేస్తున్నారు. పసికూన జట్టుపై కాదని.. రాబోయే టీ20 వరల్డ​్‌ కప్‌లో సత్తా చాటాలని అంటున్నారు పాకిస్థాన్‌ అభిమానులు. ఈ మూడు టీ20ల సిరీస్‌లో పాకిస్థాన్‌ తొలి మ్యాచ్‌ ఓడిపోయిన విషయాన్ని కూడా క్రికెట్‌ అభిమానులు ప్రస్తావిస్తున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్‌ బాల్బిర్నీ 26 బంతులో 35 పరుగులు, లోర్కాన్ టక్కర్ 41 బంతుల్లో 73 పరుగులు, హ్యారీ టెక్టర్ 20 బంతుల్లో 30 రన్స్‌ చేసి రాణించారు. పాక్‌ బౌలర్లలో షాహిన్‌ షా అఫ్రిదీ 3, అబ్బాస్‌అఫ్రిదీ 2 వికెట్లు పడగొట్టారు. ఇక 179 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పాక్‌.. 17 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్‌ రిజ్వాన్‌ 38 బంతుల్లో 56 పరుగులు, బాబర్‌ అజమ్‌ 42 బంతుల్లో 75 పరుగులు చేసి పాకిస్థాన్‌ను గెలిపించారు. మరి ఈ మ్యాచ్‌లో బాబర్‌ ఒకే ఓవర్‌లో ఆరు సిక్సులు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments