SNP
వరల్డ్ కప్ టోర్నీలో హాట్ పేవరేట్లలో ఒకటిగా బరిలోకి దిగిన పాకిస్థాన్.. అత్యంత దారుణ ప్రదర్శనతో కనీసం సెమీస్ కూడా చేరేకునే పరిస్థితిలో లేకుండా పోయింది. అయితే.. పాక్‌కు ఈ పరిస్థితి ఆ జట్టు కెప్టెన్ బాబర్ కారణంగా వచ్చింది. ఎలా అంటే..
వరల్డ్ కప్ టోర్నీలో హాట్ పేవరేట్లలో ఒకటిగా బరిలోకి దిగిన పాకిస్థాన్.. అత్యంత దారుణ ప్రదర్శనతో కనీసం సెమీస్ కూడా చేరేకునే పరిస్థితిలో లేకుండా పోయింది. అయితే.. పాక్‌కు ఈ పరిస్థితి ఆ జట్టు కెప్టెన్ బాబర్ కారణంగా వచ్చింది. ఎలా అంటే..
SNP
వన్డే వరల్డ్ కప్ ప్రస్తుతం లీగ్ దశలో దాదాపు చివరి దశకు చేరుకుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా అందరి కంటే ముందుగా సెమీస్‌కు క్వాలిఫై అయిపోయింది. ఇక సౌతాఫ్రికా సైతం సెమీస్ చేరడం దాదాపు లాంఛనమే. అయితే.. మూడు నాలుగో స్థానం కోసం మాత్రం కాస్త పోటీ నెలకొంది. ఈ రెండు స్థానాల కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ జట్లు పోటీలో ముందున్నాయి. వీటిలో ఆసీస్, కివీస్‌కే సెమీస్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ, అదృష్టాన్ని ఎక్కువగా నమ్ముతున్న పాకిస్థాన్.. శనివారం న్యూజిలాండ్‌తో కీలక మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితేనే పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఓడిందా? ఇక అంతే సంగతులు.
అయితే.. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఎంతో పటిష్టంగా కనిపించిన పాకిస్థాన్, తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గి బలమైన ప్రత్యర్థినే అంటూ హెచ్చరికలు జారీ చేసింది. కానీ, ఇండియాతో మ్యాచ్ తర్వాత పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా మారింది. ఆ జట్టును ఏకంగా ఆఫ్ఘనిస్థాన్ సైతం ఓడించే స్థాయికి దిగజారిపోయింది పాక్. అయితే.. ఆ జట్టుకు ఈ పరిస్థితి రావడానికి కారణం కెప్టెన్ బాబర్ అజమ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఈ టోర్నీలో బ్యాటర్‌గానే కాక, కెప్టెన్‌గా కూడా బాబర్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అందుకు బాబర్ తీసుకున్న నిర్ణయాలే ఉదాహరణ. జట్టులో అతను చేసిన మార్పులు ఆ జట్టు విజయావకాశాలను దెబ్బతీశాయి.
టోర్నీ ఆరంభంలో ఫకర్ జమాన్-ఇమామ్ ఉల్ హక్ పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. జమాన్ ఓ రెండు మ్యాచ్‌ల్లో పరుగులు సరిగా చేయకపోవడంతో అతని స్థానంలో అబ్దుల్లా షఫీక్‌ను తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఇమామ్ ఫామ్‌లో లేడని మళ్లీ ఫకర్ జమాన్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకొచ్చాడు. ఒక ప్లేయర్‌ను నమ్మి వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన తర్వాత అతనికి కాస్త సమయం ఇచ్చి.. జట్టులో స్థానంపై భరోసా ఇవ్వాలి. గెలిచిన రెండు మ్యాచ్‌ల్లో పరుగులు చేయలేదని జమాన్ లాంటి మ్యాచ్ విన్నర్‌ను పక్కనపెట్టాడం సరికాదు. ఎంతో కీలకమైన న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో జమాన్ సెంచరీతో చెలరేగాడు. ఆరంభంలోనే జమాన్‌పై ఇంకాస్త నమ్మకం ఉంచి అతన్ని కొనసాగించి ఉంటే అతను పాక్‌ను గెలిపించేవాడు.
ఇక్కడే కెప్టెన్‌గా రోహిత్ శర్మ అంత ఎత్తులో ఉంటే బాబర్ అజమ్ తేలిపోయాడు. గిల్ లాంటి ఆటగాడు జ్వరంతో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైనా.. అతని స్థానంలో ఇషాన్ కిషన్ బాగానే ఆడుతున్నా.. రెగ్యులర్ ఓపెనర్, మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ అయిన గిల్‌ను తిరిగి జట్టులోకి తీసుకుని, పెద్దగా పరుగులు చేయకపోయినా.. నమ్మకం ఉంచాడు. ఇప్పుడు గిల్ ఎలాంటి ఫామ్‌లోకి వచ్చేశాడో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే సిరాజ్ వికెట్లు తీయలేకపోతున్నా.. అతన్ని కూడా జట్టు నుంచి తప్పించలేదు. ఓ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్‌కు కెప్టెన్‌కు ఎలాంటి నమ్మకం ఉండాలో రోహిత్ శర్మను చూసి బాబర్ అజమ్ నేర్చుకువాల్సిన పరిస్థితి ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
What an innings by Fakhar Zaman, by far Pakistan’s best batter. Which brains kept him on the bench for the best part of the tournament, God knows.
Protein ki bhi kami nahin, jajbe ki bhi . #NZvsPak pic.twitter.com/t6GdvKRjJ5— Virender Sehwag (@virendersehwag) November 4, 2023