వీడియో: ఫ్యాన్స్ పై కోపంతో ఊగిపోయిన బాబర్.. బూతులు తిడుతూ.. బాటిల్ విసురుతూ..!

పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఫ్యాన్స్ పై కోపంతో ఊగిపోయాడు పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్. ఫ్యాన్స్ ను బూతులు తిడుతూ.. బాటిల్ విసరబోయాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మరి ఇంతకీ బాబర్ కోపానికి కారణమేంటి?

పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఫ్యాన్స్ పై కోపంతో ఊగిపోయాడు పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్. ఫ్యాన్స్ ను బూతులు తిడుతూ.. బాటిల్ విసరబోయాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మరి ఇంతకీ బాబర్ కోపానికి కారణమేంటి?

బాబర్ అజామ్.. వరల్డ్ కప్ 2023లో పాకిస్తాన్ జట్టు దారుణంగా వైఫల్యం చెందడంతో.. పాక్ క్రికెట్ బోర్డు ప్రక్షాళన చేపట్టింది. అందులో భాగంగా బాబర్ కెప్టెన్సీ ఊడిపోయింది. ఆ తర్వాత ఫామ్ కోల్పోయిన అతడు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో పూర్తిగా విఫలమైయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ లో పెషావర్ జల్మీ టీమ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే తాజాగా ముల్తాన్ టీమ్ తో జరిగిన మ్యాచ్ లో బాబర్ ఫ్యాన్స్ పై కోపంతో ఊగిపోయాడు. బూతులు తిడుతు.. బాటిల్ విసిరేయబోయాడు. మరి బాబర్ అంతలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు చూద్దాం.

పాకిస్తాన్ సూపర్ లీగ్ లో బాబర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇటీవలే కరాచీ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 72 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలోనే ప్రపంచ రికార్డును సైతం సాధించాడు. టీ20 ఫార్మాట్ లో అతి తక్కువ ఇన్నింగ్స్ ల్లో 10 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా బాబర్ అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ఇంతటి ఘనత సాధించిన బాబర్ కు.. ఊహించని షాకిచ్చారు ముల్తాన్ ఫ్యాన్స్. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా పెషావర్-ముల్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ సమయంలో బౌండరీ లైన్ దగ్గర కూర్చుని మ్యాచ్ ను చూస్తున్నాడు బాబర్.

ఈ క్రమంలో ముల్తాన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా బాబర్ ను ‘జిమ్ బాబర్’ ‘జిమ్ బాబర్’ అంటూ గట్టిగా అరుస్తూ.. ఎగతాళి చేయడం ప్రారంభించారు. ఇక ఇది విన్న బాబర్ వారివైపు కోపంగా చూస్తూ.. బూతులు తిడుతు, బాటిల్ ను విసరబోయాడు. వారిని తన దగ్గరికి రావాలని పిలిచాడు. అయినా గానీ వారు అలానే అరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రేక్షకులు అలా చేసి ఉండకూడదు.. ఇది నిజంగా బాధాకరం. పాపం బాబర్ కు వచ్చిన కష్టం పగవాడికి కూడా రావొద్దంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ పై బాబర్ ఆగ్రహం వ్యక్తం చేయడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: హైదరాబాద్ లో CCL మ్యాచ్ లు.. వారందరికీ ఫ్రీ ఎంట్రీ!

Show comments