ఒక్క బాల్‌కి ట్రోల్‌ చేశారు.. కానీ, ఆజమ్‌ బాదుడి గురించి తెలుసా? భయంకరమైన బ్యాటర్‌!

ఒక్క బాల్‌కి ట్రోల్‌ చేశారు.. కానీ, ఆజమ్‌ బాదుడి గురించి తెలుసా? భయంకరమైన బ్యాటర్‌!

Azam Khan, Mark Wood, PAK vs ENG: ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో ఓ బౌన్సర్‌ను ఎదుర్కొలేక ఆజమ్‌ ఖాన్‌ అవుట్‌ కావడంతో అతన్ని ట్రోల్‌ చేశారు. కానీ ఆజమ్‌ ఖాన్‌ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Azam Khan, Mark Wood, PAK vs ENG: ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో ఓ బౌన్సర్‌ను ఎదుర్కొలేక ఆజమ్‌ ఖాన్‌ అవుట్‌ కావడంతో అతన్ని ట్రోల్‌ చేశారు. కానీ ఆజమ్‌ ఖాన్‌ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024కి ముందు పాకిస్థాన్‌ క్రికెటర్‌ ఆజమ్‌ ఖాన్‌ భారీ ట్రోలింగ్‌కు గురి అవుతున్నాడు. ఈ పాక్‌ హల్క్‌ తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో దారుణంగా విఫలం అయ్యాడు. బ్యాటింగ్‌లోనే కాదు.. వికెట్‌ కీపర్‌గా సులువైన క్యాచ్‌లను వదిలేసి నవ్వుల పాలయ్యాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ మార్క్‌ వుడ్‌ వేసిన ఓ బౌన్సర్‌ను ఎదుర్కొలేక.. ఆజమ్‌ ఖాన్‌ అవుటైన తీరుపై దారుణమైన ట్రోలింగ్‌ జరిగింది. ఇలాంటి ఆటగాళ్లతో పాకిస్థాన్‌ టీ20 వరల్డ్‌ కప్‌ గెలవడానికి వచ్చింది అంటూ నెటిజన్లు ట్రోల్‌ చేశారు. అయితే.. కొంతమంది మాత్రం ఆజమ్‌ ఖాన్‌ అసలు రూపం చాలా మందికి తెలియదని, కేవలం ఒక్క బౌన్సర్‌ని చూసి అతన్ని ట్రోల్‌ చేస్తున్నారు కానీ, అతను సృష్టించిన విధ్వంసాలు ఇవి అంటూ ఆజమ్‌ ఖాన్‌ పాత వీడియోలను షేర్‌ చేస్తున్నారు.

కొన్ని నెలల క్రితం ఆజమ్‌ ఖాన్‌ పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌, కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడిన మంచి ఇన్నింగ్స్‌లకు సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. ఈ పాకిస్థానీ బీస్ట్‌ బ్యాటింగ్‌ చేస్తే.. బాల్‌ బౌండరీ లైన్‌ బయట పడాల్సిందే అని అంటున్నారు. నిజానికి ఆజమ్‌ ఖాన్‌ అంత గొప్ప ఆటగాడేం కాదు. కానీ, టీ20 క్రికెట్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌ చేయడంలో మాత్రం కాస్త ముందున్నాడు. అంత భారీ కాయంతో ఉన్నా కూడా మంచి మంచి షాట్లు ఆడగలడు. అలాగే వికెట్‌ కీపర్‌గానూ కొన్ని నమ్మశక్యం కానీ క్యాచ్‌లు అందుకున్నాడు.

తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోస్‌లో ఆజమ్‌ ఖాన్‌.. పాకిస్థాన్‌ దిగ్గజ బౌలర్లను ఊతికి ఆరేస్తున్న సీన్లు చూడొచ్చు. పాక్‌ స్పీడ్‌స్టర్‌ మొహమ్మద్‌ ఆమీర్‌ను కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆజమ్‌ ఖాన్‌ పిచ్చికొట్టుడు కొట్టాడు. అలాగే పీఎస్‌ఎల్‌లో పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదీ బౌలింగ్‌లో ఏకంగా 6, 6, 4, 6, 6, 6 బాది ఔరా అనిపించాడు. ఇంతటి విధ్వంసం సృష్టించగల ఈ బ్యాటర్‌.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఓ బౌన్సర్‌కు అవుటైనందుకు భారీ ట్రోలింగ్‌కు గురయ్యాడు. కానీ, ఇదే బ్యాటర్‌ టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో ఇండియాకు కూడా బిగ్గెస్ట్‌ త్రెట్‌గా మారొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఆజమ్‌ ఖాన్‌ బ్యాటింగ్‌, మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో అతను అవుటైన విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

Show comments