iDreamPost
android-app
ios-app

VIDEO: బాల్‌ చూడకుండా భారీ సిక్స్‌! గుడ్డి ఊపుడంటున్న ఫ్యాన్స్‌

  • Published Sep 19, 2023 | 5:56 PM Updated Updated Sep 19, 2023 | 5:56 PM
  • Published Sep 19, 2023 | 5:56 PMUpdated Sep 19, 2023 | 5:56 PM
VIDEO: బాల్‌ చూడకుండా భారీ సిక్స్‌! గుడ్డి ఊపుడంటున్న ఫ్యాన్స్‌

కరేబియన్‌ గడ్డపై పాకిస్థాన్‌ బాహుబలి భారీ సిక్స్‌తో చెలరేగాడు. పైగా బాల్‌ను చూడకుండా కొట్టిన ఆ సిక్స్‌ ఏకంగా 101 మీటర్ల దూరం వెళ్లింది. కళ్లుచెదిరే ఈ షాట్‌ను అతను కూడా చూడకుండానే కొట్టడం విశేషం. క్రికెట్‌ బాషలో దీన్ని నో లుక్‌ సిక్స్‌ అంటారు అనుకోండి. కానీ, పాక్‌ బ్యాటర్‌ ఆజమ్‌ ఖాన్‌ మాత్రం ఈ షాట్‌ను అడ్డి గుడ్డిగా కొట్టాడంటూ కొంతమంది క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. మరి ఆ షాట్‌ కథా కమామీషూ ఏంటో ఇప్పుడు చూద్దాం..

వెస్టిండీస్‌లో జరుగుతున్న కరేబియన్‌ లీగ్‌ 2023లో పాకిస్థాన్‌ ఆటగాడు ఆజమ్‌ ఖాన్‌ గయానా అమెజాన్‌ వారియర్స్‌ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఈ నెల 16న గయానా అమెజాన్‌ వారియర్స్‌-ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆజమ్‌ ఖాన్‌ చేసింది కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. కానీ, అతను కొట్టిన ఒకే ఒక సిక్స్‌ మాత్రం 101 మీటర్లు వెళ్లింది. నైట్‌ రైడర్స్‌ బౌలర్‌ జేడెన్ సీల్స్ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో మూడో బంతిని ఆజమ్‌ ఖాన్‌.. మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్స్‌ కొట్టాడు. అయితే.. ఆ సిక్స్‌ను ఆజమ్‌ ఖాన్‌ బాల్‌వైపు చూడకుండా కొట్టాడు. కేవలం.. టైమింగ్‌తో కొట్టాడు. దీంతో.. దీన్ని నో బాల్‌ సిక్స్‌గా సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌గా మారింది. అయితే.. కొంతమంది దాన్ని గుడ్డి ఊపుడుగా పేర్కొంటున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కీసీ కార్తీ 49 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులతో 83 పరుగులతో సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఓపెనర్‌ మార్క్‌ డియాల్‌ 37 పరుగులతో పర్వాలేదనిపించాడు. కానీ, మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. ఇక 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి గయానా 18.2 ఓవర్లలో 4 వికెట్ల కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. ఆ జట్టు ఓపెనర్‌ సైమ్‌ అయూబ్‌(37), ఓడియన్‌ స్మిత్‌(44), షాయ్‌ హోప్‌(54) రాణించడంతో గయానాకు విజయం సులువైంది. చివర్లో ఆజమ్‌ ఖాన్‌ 5 బంతుల్లో ఒక ఫోర్‌, ఒక సిక్స్‌తో 12 పరుగులు చేశాడు. మరి ఈ మ్యాచ్‌లో ఆజమ్‌ ఖాన్‌ కొట్టిన సిక్స్‌ వీడియో కింద ఉంది. చూసి దానిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సంజూ శాంసన్​కు శని ఇలా పట్టుకుందేంటి? ఒకేసారి రెండు ఛాన్సులు మిస్!

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap