iDreamPost
android-app
ios-app

వీడియో: మ్యాచ్‌లో డకౌట్‌ అయి.. అభిమానితో గొడవకు దిగిన పాక్‌ క్రికెటర్‌ ఆజమ్‌ ఖాన్‌!

  • Published Jun 07, 2024 | 11:10 AM Updated Updated Jun 07, 2024 | 11:10 AM

Azam Khan, PAK vs USA, T20 World Cup 2024: అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్‌ డక్‌ అయి.. పెవిలియన్‌కు వెళ్తున్న ఆజమ్‌ ఖాన్‌ను ఓ అభిమాని దారుణంగా తిట్టాడు. దాంతో ఆజమ్‌ ఖాన్‌ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

Azam Khan, PAK vs USA, T20 World Cup 2024: అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్‌ డక్‌ అయి.. పెవిలియన్‌కు వెళ్తున్న ఆజమ్‌ ఖాన్‌ను ఓ అభిమాని దారుణంగా తిట్టాడు. దాంతో ఆజమ్‌ ఖాన్‌ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Jun 07, 2024 | 11:10 AMUpdated Jun 07, 2024 | 11:10 AM
వీడియో: మ్యాచ్‌లో డకౌట్‌ అయి.. అభిమానితో గొడవకు దిగిన పాక్‌ క్రికెటర్‌ ఆజమ్‌ ఖాన్‌!

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో తొలి సంచలనం నమోదు అయింది. అసోసియేట్‌ టీమ్‌ అమెరికా.. మాజీ ఛాంపియన్‌ పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్‌ కప్‌ టోర్నీకి ముందు ఆర్మీ ట్రైనింగ్‌ తీసుకుని మరీ బరిలోకి దిగిన పాకిస్థాన్‌ తమ తొలి మ్యాచ్‌లో యూఎస్‌ఏ చేతిలో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఓటమి చాలా కారణాలు ఉన్నా.. బ్యాటింగ్‌ కూడా ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌, వైస్‌ కెప్టెన్‌ షదాబ్‌ ఖాన్‌ మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలం అయ్యారు. పాకిస్థాన్‌ హల్క్‌, పాక్‌ టీమ్‌లో ఫినిషర్‌గా ఉన్న ఆజమ్‌ ఖాన్‌ అయితే.. ఈ మ్యాచ్‌లో దారుణంగా గోల్డెన్‌ డక్‌ అయ్యాడు.

అంతకుముందు ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టీ20ల సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో కూడా ఆజమ్‌ ఖాన్‌ డకౌట్‌ అయ్యాడు. అప్పటి నుంచి అతనిపై ట్రోలింగ్‌ జరుగుతూనే ఉంది. అయితే.. ఇప్పుడు ఎంతో కీలకమైన టీ20 వరల్డ్‌ కప్‌లోని తొలి మ్యాచ్‌లో జట్టుకు ఎంతో అవసరమైన సమయంలో ఆజమ్‌ ఖాన్‌ ఎదుర్కొన్న తొలి బంతికే అవుటై.. గోల్డెన్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరడం పాకిస్థాన్ క్రికెట్‌ అభిమానులు అతనిపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంత చెత్త బ్యాటర్‌ను టీమ్‌లోకి, అందులోనూ టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి ఎలా తీసుకున్నారంటూ మండిపడుతున్నారు. మ్యాచ్‌లో ఆజమ్‌ ఖాన్‌ అవుటై.. పెవిలియన్‌కు వెళ్తున్న క్రమంలో కూడా పాక్‌ అభిమానులు ఆజమ్‌ ఖాన్‌ను ట్రోల్‌ చేశారు.

‘మోటా హాతీ’(లావు ఏనుగు) అంటూ డైరెక్ట్‌గా అతని ముందే అనడంతో ఆజమ్‌ ఖాన్‌ కోపం కట్టలు తెంచుకుంది. ఆ మాట అన్న అభిమానితో ఆజమ్‌ ఖాన్‌ గొడవ దిగాడు. ఈ సీన్‌ అక్కడ కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొల్పింది. అయితే.. ఒక క్రికెటర్‌పై ఇలాంటి చెత్త కామెంట్లు చేసిన ఆ అభిమానిపై విమర్శలు వస్తున్నాయి. అలాగే ఆజమ్‌ ఖాన్‌పై కూడా ట్రోలింగ్‌ జరుగుతుంది. తన తండ్రి మాజీ క్రికెటర్‌ కాబట్టి నెపోటిజమ్‌లో భాగంగా అతను టీమ్‌లో ఉన్నాడు కానీ, లేకుంటే.. అతనికి జట్టులో చోటు ఉండదు అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. మరి ఆజమ్‌ ఖాన్‌ డకౌట్‌తో పాటు, అభిమానితో అతని గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetjojobetCasibom girişcasibomJojobet GirişcasibomcasibomcasibomjojobetcasibomMadridbetMadridbetcasibom girişnakitbahis girişganobetpokerklasjojobetMarsbahis GüncelCasibomJojobetGrandPashaBet destekDeneme bonusu veren siteler 2026jojobet girişCasibom GirişGrandPashaBet ŞikayetJojobet GirişJojobet Giriş