ఆసీస్ బ్యాటర్ థండర్ ఇన్నింగ్స్.. ఇదేం కొట్టుడు సామీ!

  • Author Soma Sekhar Published - 09:02 PM, Thu - 23 November 23

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు తేలిపోయారు. ఆసీస్ బ్యాటర్ జోష్ ఇంగ్లీస్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు తేలిపోయారు. ఆసీస్ బ్యాటర్ జోష్ ఇంగ్లీస్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు.

  • Author Soma Sekhar Published - 09:02 PM, Thu - 23 November 23

ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి పోరులో ఆసీస్ బ్యాటర్లు దుమ్మురేపుతున్నారు. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వీసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి ఆటగాళ్లు టీమిండియా బౌలర్లను ఊచకోత కోశారు. మీరీ ముఖ్యంగా ఆ జట్టు ప్లేయర్ జోష్ ఇంగ్లీస్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. ఈ క్రమంలోనే తన తొలి ఇంటర్నేషనల్ సెంచరీని నమోదు చేశాడు. అతడి శతకంతో ఆసీస్ భారీ స్కోర్ సాధించింది.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు తేలిపోయారు. ప్రత్యర్థి బ్యాటర్ల దాటికి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. భారత యువ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు ఆసీస్ స్టార్ బ్యాటర్ జోష్ ఇంగ్లీస్. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇంగ్లీస్ బ్యాటింగ్ ముందు ప్రేక్షకపాత్ర వహించారు టీమిండియా బౌలర్లు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ టీ20ల్లో తొలి శతకాన్ని నమోదు చేసుకున్నాడు జోష్ ఇంగ్లీస్. కేవలం 47 బంతుల్లోనే సెంచరీ బాది ఇదేం కొట్టుడు సామీ అనిపించాడు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 50 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 8 సిక్స్ లతో 110 పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. అతడికి అండగా సీనియర్ ప్లేయర్ స్టీవ్ స్మిత్(52) పరుగులతో రాణించాడు. వీరిద్దరి ధాటికి ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా ఓ వికెట్ తీశారు. మరి ఆసీస్ బ్యాటర్ థండర్ ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments