iDreamPost
android-app
ios-app

ఆసీస్ క్రికెటర్ ఇంట తీవ్ర విషాదం.. నాలుగు నెలల బాబు..

  • Author Soma Sekhar Published - 03:24 PM, Wed - 25 October 23

ఇటీవల క్రికెట్ లో తీవ్ర విషాదాలు నెలకొంటున్నాయి. తాజాగా ఆసీస్ క్రికెటర్ ఫవాద్ అహ్మద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

ఇటీవల క్రికెట్ లో తీవ్ర విషాదాలు నెలకొంటున్నాయి. తాజాగా ఆసీస్ క్రికెటర్ ఫవాద్ అహ్మద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

  • Author Soma Sekhar Published - 03:24 PM, Wed - 25 October 23
ఆసీస్ క్రికెటర్ ఇంట తీవ్ర విషాదం.. నాలుగు నెలల బాబు..

ఇటీవల క్రికెట్ లో తీవ్ర విషాదాలు నెలకొంటున్నాయి. మెున్న పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ సోదరి మరణించి విషాద సంఘటన మరచిపోకముందే.. సోమవారం ఐపీఎల్ స్టార్, మాజీ ఆటగాడు పాల్ వాల్తాటి తన సోదరిని, మేనల్లుడిని కోల్పోయాడు. ఈ విషాద సంఘటనలు క్రికెట్ ప్రపంచాన్ని కలచివేశాయి. ఈ సంఘటనలను మరచిపోకముందే.. తాజాగా మరో విషాదం క్రికెట్ లో చోటుచేసుకుంది. ఆసీస్ క్రికెటర్ ఫవాద్ అహ్మద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అతడి నాలుగు నెలల కుమారుడు అనారోగ్యంతో మరణించాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. తీవ్ర భావోద్వేగానికి గురైయ్యాడు.

ఆస్ట్రేలియా క్రికెటర్ ఫవాద్ అహ్మద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఫవాద్ కు నాలుగు నెలల కుమారుడు ఉన్నాడు. బాబు పుట్టినప్పటి నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఫవాద్ తెలిపాడు. దీంతో బాబుకు మెల్ బోర్న్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తూ వచ్చాడు. కానీ ఫలితం లేకపోయింది. ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తూ.. వచ్చి బాబు మరణించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు ఫవాద్ అహ్మద్. ఇలాంటి భాదను ఎవరూ అనుభవించకూడదని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ భావోద్వేగ పూరిత పోస్ట్ చేశాడు అహ్మద్. ఇక అతడు ఆసీస్ తరఫున 2013లో 5 వన్డేలు, రెండు టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం విక్టోరియా క్లబ్ తరపున ఆడుతున్నాడు.

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetmoon girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel