ఆఫ్గాన్ చేతిలో ఓడినా.. తగ్గని ఆసీస్ తలబిరుసు! ఇండియాని టార్గెట్ చేస్తూ చీప్ కామెంట్స్!

ఆఫ్గాన్ చేతిలో ఓడిపోయిన తర్వాత కూడా ఆసీస్ తలబిరుసు తగ్గలేదు. ఇండియాను టార్గెట్ చేస్తూ.. ఆ జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్ చీప్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ఆఫ్గాన్ చేతిలో ఓడిపోయిన తర్వాత కూడా ఆసీస్ తలబిరుసు తగ్గలేదు. ఇండియాను టార్గెట్ చేస్తూ.. ఆ జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్ చీప్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆస్ట్రేలియాకు ఊహించని షాకిచ్చింది ఆఫ్గానిస్తాన్. సూపర్ 8లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది ఆఫ్గాన్. 149 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక 127 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఆసీస్ పరువు కాస్త గంగలో కలిసింది. ఇప్పటి వరకు ఆఫ్గాన్ ఆసీస్ పై విజయం సాధించలేదు. ఇదే మెుదటిసారి. కాగా.. ఆఫ్గాన్ చేతిలో ఓడిపోయిన తర్వాత కూడా ఆసీస్ తలబిరుసు తగ్గలేదు. ఇండియాను టార్గెట్ చేస్తూ.. ఆ జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్ చీప్ కామెంట్స్ చేశాడు.

టీ20 వరల్డ్ కప్ లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. సూపర్ 8లో భాగంగా గ్రూప్ 1లో ఉన్న ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జూన్ 24న మ్యాచ్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్ కు ముందు.. ఆసీస్ కు భారీ షాక్ ఇచ్చింది ఆఫ్గాన్. కీలకమైన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు ఆఫ్గాన్ ప్లేయర్లు. దాంతో కంగారూ టీమ్ కు ఓటమి తప్పలేదు. అయితే చిన్న జట్టు చేతిలో ఓడిపోయినప్పటికీ.. ఆసీస్ తలబిరుసు మాత్రం తగ్గలేదు. ఆఫ్గాన్ పై ఓటమి అనంతరం ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ ఇండియాను టార్గెట్ చేస్తూ.. చీప్ కామెంట్స్ చేశాడు.

మిచెల్ మార్ష్ మాట్లాడుతూ..”మా టీమ్ పై మాకు నమ్మకం ఉంది. అయితే ఈ ఓటమి చాలా బాధాకరం. ఇందులో నుంచి మేం త్వరగా బయటపడాలి.. పడతాం కూడా. అయితే మరో 36 గంటల్లో మేం ఓ అద్భుతాన్ని సృష్టించబోతున్నాం. ఇది కచ్చితంగా ఇండియాకు వ్యతిరేకంగానే ఉంటుంది. మేం ఇండియాను ఈజీగా ఓడిస్తాం. ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్. అయితే చరిత్ర మాకు అనుకూలంగా ఉంది. ఈ మ్యాచ్ లో కచ్చితంగా ఇండియాను ఓడిస్తాం” అంటూ చీప్ కామెంట్స్ చేశాడు. 2023 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను  పునరావృతం చేస్తాం అన్న ఉద్దేశంలో మార్ష్ ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ కామెంట్స్ పై టీమిండియా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఆఫ్గాన్ చేతిలో ఓడిపోయిన మీరు ఇండియాను ఓడిస్తాం అనడం.. కామెడీగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు.

Show comments