వరల్డ్ కప్ సెకండాఫ్ మామూలుగా లేదు. ఒకదాని తర్వాత ఇంకోకటి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్‌ను ఆడియెన్స్‌కు పంచుతున్నాయి. ఆసీస్-కివీస్ మ్యాచ్ అయితే లాస్ట్ సెకన్ వరకు టెన్షన్ టెన్షన్‌గా సాగింది.
వరల్డ్ కప్ సెకండాఫ్ మామూలుగా లేదు. ఒకదాని తర్వాత ఇంకోకటి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్‌ను ఆడియెన్స్‌కు పంచుతున్నాయి. ఆసీస్-కివీస్ మ్యాచ్ అయితే లాస్ట్ సెకన్ వరకు టెన్షన్ టెన్షన్‌గా సాగింది.
వన్డే వరల్డ్ కప్-2023లో భారీ స్కోర్లు రాట్లేదు, హైటెన్షన్ మ్యాచ్‌లు జరగట్లేదు, స్టేడియాలకు ప్రేక్షకులు రావట్లేదనే విమర్శలు వినిపించాయి. దీనిపై సోషల్ మీడియాలో కొందరు విదేశీ మాజీ క్రికెటర్లు పోస్టులు పెట్టడం చూసే ఉంటారు. అయితే వీటన్నింటికీ రెండ్రోజుల్లో రెండు అద్భుతమైన మ్యాచులతో చెంపపెట్టు లాంటి సమాధానం దొరికింది. సౌతాఫ్రికా-పాకిస్థాన్ టీమ్స్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. చివరి వరకు ఏ టీమ్ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే ఆఖరుకు సఫారీ టీమ్ 1 వికెట్ తేడాతో మ్యాచ్ నెగ్గింది. ఈ మ్యాచ్‌కు దాదాపు 20 వేల మంది ఆడియెన్స్ వచ్చారని తెలుస్తోంది.
ఇవాళ మరో హైటెన్షన్ మ్యాచ్ జరిగింది. ఫేవరెట్స్ అయిన ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ లాస్ట్ బాల్ వరకు వెళ్లింది. మ్యాచ్‌లో ఒక టైమ్‌లో ఆసీస్ గెలుస్తుందని అనిపించింది. కానీ ఆఖరు వరకు ఫైట్ చేసిన న్యూజిలాండ్ మ్యాచ్‌ను చేజిక్కించుకునేలానే కనిపించింది. మొత్తానికి ఈ మ్యాచ్‌లో కంగారూలనే విజయం వరించింది. భారీగా వచ్చిన ప్రేక్షకుల నడుమ మధ్య జరిగిన ఈ మ్యాచ్ వరల్డ్ కప్‌లో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లింగ్ అంటే ఎలా ఉంటుందో ప్రూవ్ చేసింది. మెగా టోర్నీలో వరుసగా రెండు రోజుల్లో రెండు థ్రిల్లర్స్ జరగడంతో సెకండాఫ్ మరింత ఉత్కంఠభరితంగా సాగుతుందని అందరికీ అర్థమైపోయింది.
ఆసీస్-కివీస్ మ్యాచ్ చాలా రికార్డులకు వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కమిన్స్ సేన 388 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లకు 383 రన్స్ చేసి ఐదు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 771 రన్స్ నమోదయ్యాయి. 48 ఏళ్ల వన్డే వరల్డ్ కప్ హిస్టరీలో ఒక మ్యాచ్‌లో ఇంత స్కోరు నమోదు కావడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం విశేషం. కివీస్, ఆసీస్ కలసి ఈ రికార్డును నమోదు చేశాయి. మరి.. ఈ వరల్డ్ కప్‌లో ఇలాంటి హై స్కోరింగ్ మ్యాచెస్ మరిన్ని జరగాలని మీరు అనుకుంటే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: VIDEO: వార్నర్, హెడ్ ఊహకందని విధ్వంసం.. 2 బంతుల్లోనే ఏకంగా..!
Australia – 388/10(49.2)
New Zealand – 383/9(50)
771 runs scored in the match – highest ever in a World Cup game in the 48 year old history. pic.twitter.com/oUCfvvdi48
— Johns. (@CricCrazyJohns) October 28, 2023