iDreamPost
android-app
ios-app

లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన అంపైర్.. ఆగిపోయిన మ్యాచ్! వీడియో వైరల్..

  • Published Dec 28, 2023 | 11:57 AM Updated Updated Dec 28, 2023 | 11:57 AM

థర్డ్ అంపైర్ లిఫ్ట్ లో ఇరుక్కుపోవడంతో మ్యాచ్ కొంతసేపు ఆగిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

థర్డ్ అంపైర్ లిఫ్ట్ లో ఇరుక్కుపోవడంతో మ్యాచ్ కొంతసేపు ఆగిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

  • Published Dec 28, 2023 | 11:57 AMUpdated Dec 28, 2023 | 11:57 AM
లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన అంపైర్.. ఆగిపోయిన మ్యాచ్! వీడియో వైరల్..

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లో చిత్ర విచిత్రమైన సన్నివేశాలు జరగడం మనం ఎన్నోసార్లు చూశాం. మ్యాచ్ లో గొడవలు జరగడం, ఫీల్డింగ్ విన్యాసాలు, బ్యాటింగ్ మెరుపులు, లవ్ ప్రపోజల్స్ లాంటి సన్నివేశాలు చాలా చూశాం. ఇక వర్షం అంతరాయం కారణంగా మ్యాచ్ లు ఆగిపోవడాలు, వెలుతురు సరిగ్గా లేని రిజన్ తో మరికొన్ని మ్యాచ్ లు ముందుగానే ముగించిన సంగతి తెలిసిందే. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం థర్డ్ అంపైర్ లిఫ్ట్ లో ఇరుక్కుపోవడంతో మ్యాచ్ కొంతసేపు ఆగిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-పాకిస్తాన్ జట్ల మధ్య బాక్సింగ్ డే టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ కు వరుసగా అంతరాయాలే ఎదురౌతున్నాయి. దీంతో మ్యాచ్ అనుకున్న సమయం కంటే ముందుగానే ముగుస్తూ వస్తోంది. తొలి రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించగా.. ఆ తర్వాత పావురాలు మ్యాచ్ కు కొద్దిసేపు ఆటంకం కలిగించాయి. తాజాగా ఇవాళ(గురువారం, డిసెంబర్ 28) మూడో రోజు ఆటలో థర్డ్ అంపైర్ లిఫ్ట్ లో ఇరుక్కుపోవడంతో.. కొన్ని నిమిషాలు ఆటను నిలిపివేశారు. అసలేం జరిగిందంటే? పాకిస్తాన్ 194/6తో మూడో రోజు ఆటను ప్రారంభించింది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి 264 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. ప్యాట్ కమ్మిన్స్ 5 వికెట్లతో చెలరేగగా.. నాథన్ లయోన్ 4 వికెట్లు తీశాడు.

అనంతరం 54 రన్స్ స్వల్ప ఆధిక్యంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే లంచ్ ముగించుకుని ఆటగాళ్లు, ఫీల్డ్ అంపైర్లు గ్రౌండ్ లోకి వచ్చారు. కానీ అంపైర్లు ఆటను మాత్రం స్టార్ట్ చేయలేదు. దానికి కారణం ఏంటని ఆరా తీయగా.. థర్డ్ అంపైర్ రిచర్డ్ లిఫ్ట్ లో ఇరుక్కుపోవడమే అని తెలిసింది. ఇక ఈ విషయం తెలిసి ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన నవ్వు ఆపుకోలేకపోయాడు. మరోవైపు ఫోర్త్ అంపైర్, థర్డ్ అంపైర్ రూమ్ వైపు పరిగెత్తుకెళ్లాడు. కొన్ని నిమిషాల తర్వాత రిచర్డ్ బయటకిరావడంతో అందరూ ఊపిరిపీల్చుకుని ఆటను మెుదలుపెట్టారు. ఇది జరుగుతున్నంత సేపు కెమెరా థర్డ్ అంపైర్ వైపే ఫోకస్ చేయడంతో.. తాను తిరిగొచ్చానంటూ చేయి ఊపాడు రిచర్డ్. దాంతో ఆటను మెుదలుపెట్టాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss