క్రికెట్ లవర్స్‌కు యాషెస్ సిరీస్ అసలైన మజా పంచుతోంది. బూడిద కప్ కోసం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు హోరాహోరీగా తలపడుతూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నాయి. తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ నెగ్గినప్పటికీ, ఇంగ్లండ్ ఆడిన తీరును మాత్రం ప్రశంసించకుండా ఉండలేం. ఎలాగైనా రిజల్ట్ రాబట్టాలని ఫస్ట్ డే నుంచి ఇంగ్లీష్ టీమ్ బజ్‌బాల్ గేమ్‌తో అదరగొట్టింది. అయితే కమిన్స్ సేన అద్భుతమైన ఆటతీరుతో ఇంగ్లండ్‌కు పరాజయం తప్పలేదు. ఈ నేపథ్యంలో యాషెస్ మూడో టెస్ట్ కీలకంగా మారింది. ఇందులోనూ ఓడితే ఇంగ్లండ్ పని అయిపోనట్లే. అందుకే ఎలాగైనా గెలిచి తీరాలని ఇంగ్లీష్ టీమ్ బరిలోకి దిగింది. ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన కంగారూ జట్టుకు ఇంగ్లండ్ పేసర్లు చుక్కలు చూపిస్తున్నారు.
పేసర్లు స్టువర్ట్ బ్రాడ్, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ సూపర్బ్ బౌలింగ్‌తో తలో వికెట్ తీశారు. తద్వారా కీలకమైన టెస్టులో ఇంగ్లండ్ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా మార్క్ వుడ్ తన పేస్‌తో ఆసీస్ బ్యాటర్లను గడగడలాడించాడు. వుడ్ వేసే బంతులకు ఆస్ట్రేలియా బ్యాటర్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. అతడు వేసిన ఒక బాల్‌కు ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అయితే కళ్లుతేలేశాడు. 37 బంతుల్లో 13 రన్స్‌తో ఆడుతున్న ఖవాజాను ఒక అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్ట్ చేశాడీ స్పీడ్‌స్టర్. వుడ్ 152 కిలోమీటర్ల వేగంతో వేసిన ఆ బాల్‌ను ఆడటంలో ఖవాజా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు.
కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, అద్భుతమైన పేస్, నియంత్రణతో కూడిన బౌలింగ్‌తో ఆసీస్‌ను వణికించాడు మార్క్ వుడ్. అతడి పేస్‌ను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆసీస్ బ్యాట్స్‌మెన్ కంగారు పడ్డారు. వుడ్ ఓవర్లో రన్స్ తీసేందుకు ఆపసోపాలు పడ్డారు. వుడ్ తన తొలి 4 ఓవర్లలో కేవలం 2 రన్స్ మాత్రమే ఇచ్చి ఖవాజా వికెట్ తీశాడు. దీన్ని బట్టే అతడి బౌలింగ్ ప్రతాపం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు 6 ఓవర్లు వేసిన మార్క్ వుడ్.. మొత్తంగా 8 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అందులో 3 మెయిడెన్లు ఉండటం విశేషం. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా 26 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 91 రన్స్‌తో ఉంది. ట్రావిస్ హెడ్ (10 నాటౌట్), మిచెల్ మార్ష్ (5 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
Mark Wood in his first 4 overs:
0, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 2, W (Khawaja). pic.twitter.com/GJaQ6ieID0
— Johns. (@CricCrazyJohns) July 6, 2023
A 94mph Mark Wood rocket cleans up Usman Khawaja! 🚀#ENGvAUS | #Ashes pic.twitter.com/Ji0BdzwmvU
— ESPNcricinfo (@ESPNcricinfo) July 6, 2023
What a spell by Mark Wood.
One of the best in Ashes 2023!!!!pic.twitter.com/VBbe9KoMOI
— Johns. (@CricCrazyJohns) July 6, 2023