U19 World Cup: భారత అండర్‌-19 వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి తెలంగాణ కుర్రాడు!

బీసీసీఐ తాజాగా ప్రకటించిన అండర్-19 మెన్స్ వరల్డ్ కప్ టీమ్ లోకి తెలంగాణ కుర్రాడు ఎంపికైయ్యాడు. దాంతోపాటుగా సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య జరిగే ట్రై సిరీస్ కు కూడా జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.

బీసీసీఐ తాజాగా ప్రకటించిన అండర్-19 మెన్స్ వరల్డ్ కప్ టీమ్ లోకి తెలంగాణ కుర్రాడు ఎంపికైయ్యాడు. దాంతోపాటుగా సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య జరిగే ట్రై సిరీస్ కు కూడా జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.

టీమిండియా క్రికెట్ లోకి వస్తున్న తెలుగు కుర్రాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సీనియర్ బ్యాటింగ్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ నుంచి నేటి తిలక్ వర్మ వరకు టీమిండియాలో చోటు దక్కించుకుని తెలుగు కీర్తిని ప్రపంచానికి టాటి చెప్పినవారే. ఇక ఇదే కోవలోకి రాబోతున్నాడు ఓ తెలంగాణ కుర్రాడు. బీసీసీఐ తాజాగా ప్రకటించిన అండర్-19 మెన్స్ వరల్డ్ కప్ టీమ్ లోకి తెలంగాణ కుర్రాడు ఎంపికైయ్యాడు. దాంతోపాటుగా సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య జరిగే ట్రై సిరీస్ కు కూడా జట్టులో స్థానం సంపాదించుకున్నాడు అరవెల్లి అవినాశ్ రావు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

2024 అండర్-19 మెన్స్ వరల్డ్ కప్ టీమ్ ను ప్రకటించింది బీసీసీఐ. ఈ మెగాటోర్నీతో పాటుగా సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగే ట్రై సిరీస్ కు కూడా జట్టును ప్రకటించింది. ఇక ఈ రెండిట్లో చోటు దక్కించుకున్నాడు తెలంగాణకు చెందిన వికెట్ కీపర్ అరవెల్లి అవినాశ్ రావు. రాష్ట్రాస్థాయి క్రికెట్ లో అంచెలంచెలుగా రాణిస్తూ.. అండర్-19 వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు ఈ యువ సంచలనం. ఇక ప్రతిష్టాత్మకమైన టీమ్ కు ఎంపిక కావడంతో అవినాశ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.

తెలంగాణలోని సిరిసిల్ల రాజన్న జిల్లా పోత్ గల్ గ్రామానికి చెందిన అవినాశ్ రావును తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు. ప్రతిష్టాత్మకమైన అండర్-19 వరల్డ్ కప్, సౌతాఫ్రికా ట్రై సిరీస్ కు ఎంపికైనందుకు శుభాకాంక్షలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక ఈ మెగాటోర్నీలో 2024 జవనరి 20న తన తొలి మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో ఆడనుంది. ఈ వరల్డ్ కప్ ప్రారంభానికంటే ముందే ఇండియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా మధ్య ట్రై సిరీస్ డిసెంబర్ 29న ప్రారంభం అయ్యి.. జనవరి 10న ముగుస్తుంది. ఈ టోర్నీలకు ఉదయ్ శరణ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. మరి తెలంగాణ కుర్రాడు అండర్-19 వరల్డ్ కప్ టీమ్ కు ఎంపిక కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments