SNP
Ambati Rayudu, Hardik Pandya: ప్రస్తుతం హార్దిక్ పాండ్యా టైమ్ అస్సలు బాగాలేదు. అతను ఏం చేసినా.. అది తప్పుగానే కన్వర్ట్ అవుతుంది. ఇలాంటి సమయంలో అంబటి రాయుడు పాండ్యాను కలవడం విశేషం. మరి పాండ్యాను రాయుడు ఎందుకు కలిశాడో ఇప్పుడు చూద్దాం..
Ambati Rayudu, Hardik Pandya: ప్రస్తుతం హార్దిక్ పాండ్యా టైమ్ అస్సలు బాగాలేదు. అతను ఏం చేసినా.. అది తప్పుగానే కన్వర్ట్ అవుతుంది. ఇలాంటి సమయంలో అంబటి రాయుడు పాండ్యాను కలవడం విశేషం. మరి పాండ్యాను రాయుడు ఎందుకు కలిశాడో ఇప్పుడు చూద్దాం..
SNP
క్రికెట్ చరిత్రలో ఏ భారత క్రికెటర్‌పై జరగని దారుణమైన ట్రోలింగ్ హార్ధిక్ పాండ్యాపై జరుగుతోంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా పాండ్యా పేరును అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి.. మొదలైన రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ముంబై ఇండియన్స్ మ్యాచ్ అంటే చాలు.. పాండ్యాను తిట్టడానికి, అతన్ని అవమానించడానికి చాలా మంది క్రికెట్ అభిమానులు రెడీ అయిపోతున్నారు. గ్రౌండ్‌లో పాండ్యా ఏం చేసినా.. చాలా మందికి అది తప్పులాగే అనిపిస్తోంది. అయితే.. కొంతమంది మాజీ క్రికెటర్లు మాత్రం పాండ్యాకు మద్దతుగా నిలుస్తున్నారు. వీరేందర్ సెహ్వాగ్‌తోపాటు తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సైతం పాండ్యాకు మద్దతు పలికాడు.
పాండ్యాపై జరుగుతున్న సోషల్ దాడిపై డైరెక్ట్‌గా స్పందించని రాయుడు.. నేరుగా పాండ్యాను కలిసి.. ధైర్యంగా ఉండాలని సూచించాడు. ఒక విధంగా చెప్పాలంటే.. దారుణమైన ట్రోలింగ్‌కు గురవుతున్న పాండ్యాను రాయుడు ఓదార్చాడు. ప్రస్తుతం పాండ్యాను రాయుడు కలిసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, గతంలో రాయుడు కూడా ముంబై ఇండియన్స్‌కు ఆడిన విషయం తెలిసిందే. చాలా కాలం పాటు హార్ధిక్ పాండ్యా, అంబటి రాయుడు కలిసి ఆడారు. వీరిద్దరు టీమిండియాకు కూడా కలిసే ఆడారు. వారిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అయితే.. ప్రస్తుతం పాండ్యాపై ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో రాయుడు వచ్చి.. మాట్లాడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఐపీఎల్ 2022 సీజన్ కంటే ముందు ముంబైలోనే ఉన్న పాండ్యా.. ఆ సీజన్ కంటే ముందు కొత్త ఫ్రాంచైజ్ గుజరాత్ టైటాన్స్‌కు మారాడు. కెప్టెన్‌గా ఆ జట్టును మొదటి సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిపాడు. తర్వాత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది గుజరాత్. ఇలా గుజరాత్‌ను సూపర్ సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేసిన పాండ్యాను.. ముంబై మేనేజ్‌మెంట్ మళ్లీ తమ టీమ్‌లోకి రప్పించుకుంది. అతను రాగానే, రోహిత్ శర్మను కెప్టెన్‌గా తప్పించి, పాండ్యాను కెప్టెన్ చేసింది. ఇక్కడే రోహిత్ అభిమానులకు కోపం వచ్చింది. అక్కడి నుంచి పాండ్యాపై ట్రోలింగ్‌కు దిగారు. ముంబై ఆడే మ్యాచ్‌ల సమయంలో పాండ్యా కనిపించినా, అతని పేరు వినిపించినా.. బో అంటూ మొత్తుకుంటూ తమ వ్యతిరేకతను తెలియజేస్తున్నారు. ఇలాంటి సమయంలో రాయుడు, పాండ్యాను కలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
𝐖𝐡𝐲 𝐝𝐨 𝐰𝐞 𝐟𝐚𝐥𝐥? 𝐒𝐨 𝐭𝐡𝐚𝐭 𝐰𝐞 𝐜𝐚𝐧 𝐥𝐞𝐚𝐫𝐧 𝐭𝐨 𝐩𝐢𝐜𝐤 𝐨𝐮𝐫𝐬𝐞𝐥𝐯𝐞𝐬 𝐮𝐩. 💙#MumbaiMeriJaan #MumbaiIndians | @hardikpandya7 pic.twitter.com/k3YSlofEdV
— Mumbai Indians (@mipaltan) April 2, 2024