MIలో ఎక్కువ రోజులు ఆడితే అంతే..! CSK-MIకి మధ్య తేడా ఇదే: రాయుడు

Ambati Rayudu, CSK vs MI, IPL 2024: సీఎస్‌కే, ముంబై ఇండియన్స్‌.. ఐపీఎల్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ టీమ్స్‌. అయితే.. ఈ రెండు టీమ్స్‌లో ఆడిన రాయడు.. రెండింటిలో ఏది బెస్ట్‌ టీమో చెబుతున్నాడు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Ambati Rayudu, CSK vs MI, IPL 2024: సీఎస్‌కే, ముంబై ఇండియన్స్‌.. ఐపీఎల్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ టీమ్స్‌. అయితే.. ఈ రెండు టీమ్స్‌లో ఆడిన రాయడు.. రెండింటిలో ఏది బెస్ట్‌ టీమో చెబుతున్నాడు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఐపీఎల్‌ చరిత్రలోనే చెన్నై సూపర్‌ కింగ్స్‌ ముంబై ఇండియన్స్‌ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ జట్లు. ఇప్పటి వరకు 16 సార్లు ఐపీఎల్‌ ఫైనల్స్‌ జరిగితే.. 10 సార్లు ఈ రెండు జట్లే విజేతలుగా నిలిచాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఈ రెండు టీమ్స్‌ ఐపీఎల్‌పై ఎంత ఆధిపత్యం చెలాయిస్తున్నాయో. ఐదుసార్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఐదుసార్లు ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ టైటిల్‌ను సాధించాయి. అత్యధిక సార్లు ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన టీమ్స్‌గా ఈ రెండు సమంగా ఉన్నాయి. కానీ, కొన్ని టీమ్స్‌ ఇంకా ఒక్కసారి కూడా ఐపీఎల్‌ టైటిల్‌ గెలవలేదు. ఆర్సీబీ, పంజాబ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, లక్నో వీటి ఖాతాలో ఐపీఎల్‌ టైటిల్‌ లేదు. కానీ, ఈ రెండు జట్లు ఇంత సక్సెస్‌ ఎలా అయ్యాయి? అసలు ఆ టీమ్స్‌ ఐపీఎల్ కోసం ప్రిపేర్‌ అవుతాయి, ఆటగాళ్ల మైండ్‌ సెట్‌ను ఎలా మారుస్తాయి లాంటి విషయాలను ఆ రెండు టీమ్స్‌లో చాలా కాలం ఆడి, రెండు టీమ్స్‌ తరఫున ఐపీఎల్‌ టైటిల్స్‌ గెలిచిన అంబటి రాయుడు వెల్లడించాడు.

ముందుగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ గురించి రాయుడు మాట్లాడుతూ.. చెన్నైలో ఓవరాల్‌ ప్రొగ్రస్‌ ఉంటుంది. ఇక్కడ విజయాలపై ఆధారపడి వారి మూడ్‌స్వింగ్స్‌ ఉండవు. విజయాలు వచ్చినా, పరాజయాలు వచ్చినా.. వెంటనే వాళ్లు రియాక్ట్‌ అవ్వరు. ఒక ప్రాసెస్‌ ప్రకారం వెళ్తారు. అదే వారి సక్సెస్‌కు కారణం అంటూ రాయుడు పేర్కొన్నాడు. కానీ, ముంబై ఇండియన్స​ అలా కాదు.. వాళ్లకు విజయాలే కావాలి. అందుకోసమే ఆడతారు. విక్టరీ తప్పితే వాళ్లకు ఇంకేం అవసరం లేదు. ప్రదర్శన బాగుంటునే పట్టించుకుంటారు.. సరిగ్గా ఆడకపోవడానికి లేదు టైమ్‌ తీసుకుని ఆడేందుకు అక్కడ మీకు అవకాశం ఉండదు. అక్కడి వాతావరణం అలా ఉంటుంది. కేవలం గెలుపు కోసమే ఆడతారు.

ఆటగాళ్లను కూడా అలా ప్రెజర్‌లో పెట్టి ఆడిస్తారు. అందరి మైండ్‌ సెట్‌ను అలానే ప్రిపేర్‌ చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే.. ముంబైలో అలాంటి పరిస్థితి వల్లే నన్ను నేను నిరూపించుకున్నాను. కానీ, ముంబై ఇండియన్స్‌లో ఎక్కువ కాలం ఆడితే.. మీ బుర్ర బద్దలైపోతుంది. అంత ఒత్తిడి ఉంటుంది ముంబై ఇండియన్స్‌ టీమ్‌లో. కానీ, చెన్నై సూపర్‌ కింగ్స్‌లో అయితే చాలా కాలం ఆడొచ్చు. మీ కెరీర్‌ కూడా లాంగ్‌గా సాగుతుంది. ముంబైలో మనల్ని మనమే రాణించేలా చేసుకోవాలి, చెన్నైలో మనల్ని రాణించేలా వాళ్లు తయారు చేస్తారు అని ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్స్‌ అప్రోచ్‌ను రాయుడు వెల్లడించాడు. అయితే.. ఈ రెండు ఫార్మాలాలు కూడా సక్సెస్‌ అయ్యాయి. కానీ, ఆటగాళ్ల వైపు నుంచి చూస్తే.. చాలా మంది చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌లో ఆడేందుకే ఇష్టపడుతున్నారు. మరి రాయుడు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments