Alzarri Joseph: క్యాచ్‌ పట్టకుండా నిలబడ్డ ఫీల్డర్‌! బౌలర్‌ రియాక్షన్‌ చూస్తే భయపడతారు!

క్రికెట్‌లో చాలా క్యాచ్‌ డ్రాప్‌లో జరుగుతూ ఉంటాయి. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే క్యాచ్‌ డ్రాప్‌ మాత్రం నెక్ట్స్‌ లెవెల్‌ అంతే. అస్సలు ఏ మాత్రం ప్రయత్నించకుండా.. అలాగే విగ్రహంలా నిలబడిపోయాడు ఫీల్డర్‌. ఏం జరిగిందో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

క్రికెట్‌లో చాలా క్యాచ్‌ డ్రాప్‌లో జరుగుతూ ఉంటాయి. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే క్యాచ్‌ డ్రాప్‌ మాత్రం నెక్ట్స్‌ లెవెల్‌ అంతే. అస్సలు ఏ మాత్రం ప్రయత్నించకుండా.. అలాగే విగ్రహంలా నిలబడిపోయాడు ఫీల్డర్‌. ఏం జరిగిందో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

క్రికెట్‌లో క్యాచ్‌ల కోసం కొంతమంది ఫీల్డర్లు వాళ్ల ప్రాణాలు సైతం లెక్కచేయకుండా భారీ భారీ డైవ్స్‌ కొడుతూ.. క్యాచ్‌లు అందుకుంటూ ఉంటారు. కానీ, ఈ ఫీల్డర్‌ మాత్రం చేతిలోకి వచ్చి పడుతున్న క్యాచ్‌ను పట్టకపోగా.. కనీసం దాని కోసం ప్రయత్నించలేదు. ఈ సంఘటన చిన్నా చితక మ్యాచ్‌లో జరిగింది కాదు. ఆస్ట్రేలియా-వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో జరిగింది. ఇందులో ఫీల్డర్‌ క్యాచ్‌ పట్టకపోవడం ఒక ఎత్తు అయితే.. బౌలర్‌ ఇచ్చిన రియాక్షన్‌ మరో హైలెట్‌. దగ్గర ఉంటే ఫీల్డర్‌ను కొట్టేలా కనిపించాడు. ఎక్కడో బౌండరీ లైన్‌ వద్ద ఉండటంతో ఫీల్డర్‌ బతికిపోయినట్లు ఉన్నాడు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది? తప్పు ఎవరిది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వెస్టిండీస్‌-ఆస్ట్రేలియా మధ్య హోబర్ట్‌ వేదికగా తొలి టీ20లో భాగంగా.. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో.. అల్జారీ జోసెఫ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ మూడో బంతిని ఆసీస్‌ బ్యాటర్‌ టిమ్‌ డేవిడ్‌ డీప్‌ మిడ్‌ వికెట్‌ వైపు బాల్‌ను గాల్లోకి ఆడతాడు. లో ఫుల్‌ టాస్‌గా వచ్చిన బాల్‌.. సరిగా టైమ్‌ కాకపోవడంతో సిక్స్‌ వెళ్లలేదు. కానీ, బలంగా కొట్టడంతో బాగా ఎత్తుకు వెళ్లింది. అయితే.. బాల్‌ కోసం డీప్‌ మిడ్‌ వికెట్‌లో ఉన్న ఫీల్డర్‌ అక్కడే నిలబడి దిక్కుల చూస్తున్నాడు. డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్క్వౌర్‌ లో ఉన్న ఫీల్డర్‌ పరిగెత్తుకుంటూ వచ్చాడు. కానీ అప్పటికే బాల్‌ గ్రౌండ్‌లో పడిపోయింది. బంగారం లాంటి క్యాచ్‌ అసలు ప్రయత్నించకుండానే నెలపాలైంది.

అయితే.. ఫీల్డర్‌ ఎందుకు స్పందించలేదో మాత్రం ఎవ్వరికి అర్థం కాలేదు. దీంతో బౌలర్‌ జోసెఫ్‌కు కోపం కట్టలు తెంచుకుంది. బాల్‌ పట్టేందుకు ఎందుకు ప్రయత్నించలేదని గట్టిగా అరిచాడు. తర్వాత ఫీల్డర్‌ వైపు అలాగే కోపం చూస్తూ ఉండిపోయాడు. ఆ సమయంలో జోసెఫ్‌ను చూస్తే.. చాలా మందికి భయమేసింది. కళ్లతోనే చంపేసేలా ఉన్నాడంటూ కామెంట్లు వస్తున్నాయి. అయితే.. బాల్‌ బాగా ఎత్తుగా ఫ్లెడ్‌ లైట్లను దాటి వెళ్లడంతో బాల్‌ ఎటు వైపు వస్తుందో ఫీల్డర్‌కు అర్థం కాక అలా ఉండిపోయాడని, పాపం అందులో అతని తప్పు లేదని కొంతమంది క్రికెట్‌ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. మరి ఈ క్యాచ్‌ డ్రాప్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments