WPLలో ఊహించని ఘటన.. లేడీ క్రికెటర్లపైకి దూసుకొచ్చిన ఫ్యాన్! ఆ తర్వాత..

తాజాగా జరుగుతున్న WPLలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ముంబై వర్సెస్ యూపీ వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా..

తాజాగా జరుగుతున్న WPLలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ముంబై వర్సెస్ యూపీ వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా..

క్రికెట్ మ్యాచ్ కు ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. స్టేడియం బయట, గ్రౌండ్ లో పోలీసుల పహారా ఉంటుందన్న విషయం తెలియనిది కాదు. అయితే ఈ సెక్యూరిటీని కూడా దాటుకుని కొందరు అభిమానులు తమ అభిమాన ఆటగాళ్లను కలుకుందానికి గ్రౌండ్ లోకి దూసుకొస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు మనం చరిత్రలో చాలానే చూశాం. అయితే తాజాగా జరుగుతున్న WPLలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ముంబై వర్సెస్ యూపీ వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. ఓ ఫ్యాన్ గ్రౌండ్ లోకి దూసుకొచ్చాడు. అతడిని యూపీ వికెట్ కీపర్ కమ్ కెప్టెన్ అలిసా హేలీ అడ్డుకుంది.

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే.. అనుకోకుండా కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. అందులో ఎక్కువగా ఫ్యాన్స్ తమ ఫేవరెట్ ప్లేయర్లను కలుసుకోవాలని గ్రౌండ్ లోకి పరిగెత్తుకు వస్తూ ఉంటారు. టైట్ సెక్యూరిటీని దాటుకుని మరీ తమ అభిమాన ఆటగాడిని కలుసుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. అయితే ఇది పురుషుల క్రికెట్ లో కాదు.. మహిళా క్రికెట్ లో. ప్రస్తుతం జరుగుతున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ముంబై వర్సెస్ యూపీ వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్ లో ముంబై బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఓ అభిమాని గ్రౌండ్ లోకి దూసుకొచ్చాడు. అయితే అతడిని చూసిన యూపీ కెప్టెన్ కమ్ కీపర్ అలిసా హేలీ అడ్డుకుంది. కాసేపు ఇద్దరు చిన్నపాటి ముష్టియుద్ధమే జరిగింది. అనంతరం సెక్యూరిటీ వచ్చి.. అతడిని గ్రౌండ్ వెలుపలికి తీసుకెళ్లిపోయారు. అయితే అతడు ఎవరిని కలుసుకోవడానికి వచ్చాడో స్పష్టంగా తెలియరాలేదు. కానీ హేలీ మాత్రం అతడిని ఓ ఫైటర్ లాగా అడ్డుకోవడంతో.. ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. మీరు చాలా ధైర్యవంతులు మేడం, అతడిని భలే అడ్డుకున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. 162 పరుగుల టార్గెట్ ను కేవలం 16.3 ఓవర్లలకే 3 వికెట్లు మాత్రమే నష్టపోయి దంచికొట్టింది యూపీ వారియర్స్ టీమ్. జట్టులో కిరణ్ నవ్ గిరే 31 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 57 పరుగులు చేసింది. మరి సెక్యూరిటీని దాటుకుని లేడీ క్రికెటర్లపై ఓ ఫ్యాన్ దూసుకురావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: వీడియో: గ్రౌండ్ లో స్టార్ ప్లేయర్లకు ప్రమాదం.. బలంగా ఢీ కొట్టుకోవడంతో..!

Show comments